కొవ్వు కరిగేంత వరకూ కోర్టుల చుట్టూ తిప్పుతా : PVP

  • Publish Date - April 13, 2019 / 01:05 PM IST

విజయవాడ: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా నాపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని విజయవాడ పార్లమెంట్ స్ధానానికి వైసీసీ తరుఫున పోటీ చేసిన  పొట్లూరి వరప్రసాద్ (పీవీపీ) చెప్పారు. శనివారం ఆయన  విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ ఒక ఎంపీ, రెండు మీడియా సంస్ధలు నాపై ఆరోపణలు చేశాయని సోమవారం ఒక్కొక్కరిపై 100 కోట్ల రూపాయలకు పరువునష్టం దావా వేయబోతున్నానని చెప్పారు.

ఎన్నికల ప్రచారంలో  భాగంగా “నేను కోల్గెట్ స్కామ్ లో ఉన్నానని చంద్రబాబు అన్నారు. “నన్ను స్కామ్ స్టర్ అన్నారు.. బ్లాక్ మెయిలర్ అన్నారు.. ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ అన్నారు..ఇకనుండి చట్టపరంగా వెళ్లతాను.. వాళ్ల కొవ్వు కరిగేంతవరుకు కోర్టులు చుట్టు తిప్పుతాను” అని ఆయన తెలిపారు. ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు. జీవితాంతం వారిని కోర్టుల చుట్టు తిప్పిస్తానని పీవీపీ తేల్చి చెప్పారు. “సీబీఐ కేసులు ఉన్నాయని, మనిలాండరింగ్ ఉన్నాయని”  ప్రత్యర్ధులు ఆరోపించారన్నారు. “నా మీద చేసిన ఆరోపణలపై పేపర్లు తెమ్మనండి..డిబేట్లు అక్కర్లేదు… కోర్టులే చెబుతాయి. పోలింగ్ సమయంలో టీడిపి నేతలు డబ్బులు పంచుతుంటే కొందరు పొలీసులు చోద్యం చూస్తూ కూర్చున్నారు”. వారిపైన కూడా ఉన్నతాదికారులకి ఫిర్యాదు చేయబోతున్నానని పీవీపీ తెలిపారు.