రాహుల్ గాంధీ వచ్చి ప్రత్యేక హోదా హామీ ఇచ్చి వెళ్లిన మరుసటి రోజే కాంగ్రెస్ కు వ్యతిరేఖంగా వైసీపీ శ్రేణులు నినాదాలు చేపట్టారు.
రాహుల్ గాంధీ వచ్చి ప్రత్యేక హోదా హామీ ఇచ్చి వెళ్లిన మరుసటి రోజే కాంగ్రెస్ కు వ్యతిరేఖంగా వైసీపీ శ్రేణులు నినాదాలు చేపట్టారు. దీంతో నెల్లూరు జిల్లాలో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ప్రత్యేక హోదా భరోసా బస్సు యాత్రను వైసీపీ శ్రేణులు అడ్డుకున్నాయి. వెంకటగిరి క్రాస్ రోడ్డు వద్ద కాంగ్రెస్ బస్సులకు వైసీపీ నేతలు అడ్డు పడడంతో రెండు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు వచ్చి ప్రత్యేక హోదాకు మేం భరోసా అంటే నమ్మే పరిస్థితిలో ఆంధ్రప్రజలు లేరంటూ వైసీపీ నేతలు బస్సు యాత్రను అడ్డుకున్నారు. ‘కాంగ్రెస్ గో బ్యాక్’ అంటూ గట్టిగా నినాదాలు చేస్తూ వైసీపీ నేతలు కాంగ్రెస్ నేతల భరోసాయాత్రను ఆపారు. భరోసా యాత్ర పేరుతో మరోసారి ప్రజల్ని మోసం చేసేందుకు కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందంటూ వైసీపీ నేతలు మండిపడ్డారు.
Read Also: ఓట్ల సర్వే చిచ్చు : యర్రావారిపాలెంలో హై టెన్షన్
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసేందుకు హస్తం నేతలు చేపట్టిన బస్సుయాత్రను వైసీపీ నేతలు అడ్డుకోవడం పట్ల కాంగ్రెస్ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తుందన్న నినాదంతో మేం భరోసా యాత్ర చేస్తుంటే వైసీపీ అడ్డుకుంటుందని కాంగ్రెస్ నేతలు మొండిపడుతున్నారు.
మార్చి 3వ తేదీ వరకు ఎవరు అడ్డుకున్నా కూడా ఈ యాత్ర సాగుతుందని వారు స్పష్టం చేశారు. అయితే కాంగ్రెస్ నేతలు శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వరకు బస్సుయాత్ర చేయనున్నారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో కాంగ్రెస్ బస్సులను వైసీపీ నేతలు, కార్యకర్తలు నల్లజెండాలతో నిరసన తెలిపారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.
Read Also: వాళ్లకు వ్యతిరేకం కాదు.. కశ్మీర్ కోసమే చేస్తున్నా: మోడీ