తెలంగాణలో కరోనా బెల్స్ : ఒక్కరోజే 117 కేసులు

  • Publish Date - May 29, 2020 / 12:15 AM IST

తెలంగాణ రాష్ట్రంలో కరోనా బెల్స్ ఇంకా మ్రోగుతూనే ఉన్నాయి. పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. డబుల్ డిజిట్స్ లో కేసులు రికార్డవుతుండడం ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. 2020, మే 28వ తేదీ గురువారం ఒక్కసారిగా కేసులు పెరిగాయి. ఏకంగా 117 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయి. పాజిటివ్ గా నిర్ధారణ అయిన వారిలో తెలంగాణ వాసులు 66 మంది కాగా..సౌదీ అరేబియా నుంచి వచ్చిన వారు 49 మంది, ఇద్దరు వలస కార్మికులకు వైరస్ సోకింది. అయితే..ఇతర దేశాల నుంచి వచ్చిన వారిలో ఒక్క కేసు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. 

తాజాగా కేసులు రిజిస్టర్ అయిన రాష్ట్ర వాసుల్లో GHMC లో 58 మంది ఉండగా, రంగారెడ్డి 5, మేడ్చల్ 02, సిద్ధిపేటలో ఒక కేసు నమోదైంది. తాజాగా ఈ వైరస్ బారిన పడి…నలుగురు చనిపోయారు. దీంతో కరోనా మరణాల సంఖ్య 67కు పెరిగింది. మొత్తంగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 2 వేల 256 మంది కరోనా బారిన పడ్డారని ప్రజారోగ్య డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారు. తెలంగాణకు చెందిన కేసులు 1, 908 ఉండగా, వలస దారులకు సంబంధించనవి 175, సౌదీ అరేబియా నుంచి వచ్చినవి 143 కేసులు, సడలింపులు ఇచ్చాక విదేశాల నుంచి వచ్చిన వారి ద్వారా 30 కేసులు నమోదయ్యాయి. 

కొత్త కేసులు : 17. మొత్తం కేసులు : 2, 256. మొత్తం మరణాలు : 67. చికిత్స పొందుతున్న వారు : 844. డిశ్చార్జ్ అయిన వారు : 1,345. 

శంషాబాద్ విమానాశ్రయంలో ఇద్దరు ప్రయాణీకులకు కరోనా లక్షణాలు కనిపించాయి. దీంతో వీరిని ఆసుపత్రికి తరలించారు. గౌలిపురా డివిజన్ కు చెందిన ట్రాఫిక్ ఎస్ఐ కు కరోనా సోకింది. ఖైరతాబాద్ బీజేఆర్ నగర్ కు చెందిన ఓ వృద్దురాలు కరోనా సోకి మృతి చెందగా…ఆమె కుటుంబంలో మరో 8 మందికి పాజిటివ్ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. నార్త్ లాలాగూడ ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన రైల్వే రిటైర్డ్ ఉద్యోగి బిజ్జిరామ్ కరోనా సోకి..గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. పహాడీషరీఫ్ లో మరో 8 మందికి పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. 

Read: సింగిల్ సిగిరెట్ ముగ్గురికి కరోనా అంటించేసింది