Bhaumvati Amavasya 2026 : 14న భౌమవతి అమావాస్య.. ఈ పరిహారాలు పాటిస్తే మీ కష్టాలన్నీ పోతాయ్.. వారికి అద్భుత అవకాశం..

Bhaumvati Amavasya 2026 : మంగళవారం అమావాస్య రావడంను విశేషంగా చెప్తారు. ముఖ్యంగా రాహు, కేతు దోషాలున్న వారికి ఇది చాలా యోగ్యమైన రోజు. అంతే కాకుండా మంగళవారం అమావాస్యతో కూడి రావడంను భౌమవతి అమావాస్యగా పిలుస్తారు. ఈ రోజున కొన్ని పరిహరాలు పాటిస్తే చాలా శక్తివంతంగా అవి యోగిస్తాయని పండితులు చెబుతున్నారు.

Bhaumvati Amavasya 2026

Bhaumvati Amavasya 2026 : నేడు (జులై 14వ తేదీన) భౌమవతి అమావాస్య. ఈరోజు దానధర్మాలకు చాలా ప్రత్యేకమైనది. నిజ జ్యేష్ట మాసంలో అత్యంత శక్తివంతమైన భౌమవతి అమావాస్య చాలా అరుదుగా సంభవిస్తుందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ఈసారి మంగళవారం అమావాస్య రావడంను విశేషంగా చెబుతున్నారు. ముఖ్యంగా రాహు, కేతు దోషాలున్న వారికి ఇది చాలా యోగ్యమైన రోజు. అంతేకాకుండా మంగళవారం రోజున అమావాస్య రావడంతో భౌమవతి అమావాస్యగా పిలుస్తారు. ఈరోజు కొన్ని పరిహారాలు పాటిస్తే మన జీవితంలో ఎదుర్కొనే అనేక కష్టాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

Also Read : Shruti Haasan : తల్లితండ్రులు లేకుండానే.. కొత్తింట్లోకి గృహప్రవేశం చేసుకున్న శృతి హాసన్..

అమావాస్య జులై 13వ తేదీ సాయంత్రం 6.49గంటలకు ప్రారంభమై.. జులై 14వ తేదీ మధ్యాహ్నం 3.12గంటల వరకు ముగుస్తుంది.

అమావాస్య మంగళవారంతో కలిసి రావడం వల్ల ఈరోజు కొన్ని ప్రత్యేక పరిహారాలకు అనుకూలంగా భావిస్తారు. ఈ పరిహారాలు ఎవరు చేయొచ్చో ఇక్కడ తెలుసుకుందాం.
♦ కుజదోషం (మంగళ దోషం) ఉన్నవారు.
♦ పితృదోషం ఉన్నట్లుగా భావించేవారు.
♦ అప్పులు, కోర్టు కేసులు లేదా శత్రు బాధలు ఎదుర్కొంటున్నవారు.
♦ భూమి, ఇల్లు, ఆస్తి సంబంధిత సమస్యలు ఉన్నవారు.
♦ వివాహం ఆలస్యం అవుతున్నవారు (జాతకాన్ని బట్టి)
♦ తరచూ అడ్డంకులు, ప్రమాదాలు లేదా రక్త సంబంధిత సమస్యలు ఎదురవుతున్నవారు.

పరిహారం ఎలా చేసుకోవాలి..?
♦ ఉదయం స్నానం చేసి గణపతిని, సుబ్రహ్మణ్య స్వామిని, ఆంజనేయస్వామిని లేదా శివుడిని భక్తితో పార్ధించండి.
♦ సాధ్యమైతే శివలింగానికి అభిషేకం చేసి ఓం నమ:శివాయ మంత్రాన్ని 108సార్లు జపించండి.
♦ పితృదేవతలను స్మరించి తర్పణం చేయడం (సంప్రదాయం తెలిసినవారు) శ్రేయస్కరం.
♦ ఎర్ర కందిప్పు, బెల్లం, ఎర్ర వస్త్రం లేదా మీ శక్తి మేరకు అన్నదానం చేయండి.
♦ కోపాన్ని తగ్గించి, దానం, జపం, సేవ వంటి సత్కార్యాలు చేయడం మంచింది.

భౌమవతి అమావాస్య రోజున చేసే పరిహారాలు వ్యక్తిగత జాతకాన్ని బట్టి మారవచ్చు. ప్రతిఒక్కరికీ ఒకే పరిహారం వర్తించదు. మీ జాతకానికి అనుగుణంగా పరిహారం తెలుసుకొని చేయడం ఉత్తమం.