Akshaya Tritiya : అక్షయ తృతియ నాడు బంగారం కొంటే పాపాన్ని కొనుక్కున్నట్లే.. ఈ చిన్న దానం చేస్తే ఇక మీకు తిరుగుండదు
Akshaya Tritiya : అక్షయ తృతియ నాడు బంగారం కొనాలనుకునేవారికి అలర్ట్.. అలా చేస్తే పాపాన్ని కొనుక్కున్నట్లే అంటున్నారు పండితులు.
Buying gold on Akshaya Tritiya is like buying sin Jala Daan will make you unstoppable
Akshaya Tritiya : అక్షయ తృతీయ అనగానే చాలా మంది బంగారం, లేదంటే వెండి కొనాలని భావిస్తారు. అక్షయ తృతీయ నాడు కొనుగోలు చేసేది ఏదైనా.. మరింతగా అభివృద్ధి చెందుతుందనే నమ్మకంతో, అప్పు చేసైనా సరే బంగారం కొంటారు. కానీ దీని గురించి పండితులు, ప్రవచనకర్తలు ఆసక్తికర విషయాలు వెల్లడిస్తున్నారు. అసలు అక్షయ తృతీయ నాడు బంగారం కొనాలనే ఆచారం ఎక్కడ నుంచి వచ్చిందో అర్థం కాలేదంటున్నారు. అక్షయ తృతీయ నాడు బంగారం కొనాలని పురాణాల్లో ఎక్కడా కూడా ప్రస్తావించలేదంటున్నారు.
అసలు అక్షయ తృతీయ నాడు బంగారం కొంటే పాపాన్ని కొనుక్కోవడమే అని.. బంగారంలో కలి పురుషుడు ఉంటాడని.. కనుక ఆ రోజు బంగారం కొంటే కలి పురుషుడు కూడా అక్షయం (తరగనిదిగా) ఉంటాడని హెచ్చరిస్తున్నారు. మరి ఇంతకు అక్షయ తృతీయ నాడు చేయాల్సిన అసలైన దానాల గురించి పండితులు ఇలా వివరించారు.
జలభాండ దానం:
ఒక మట్టి కుండ లేదా కూజాను శుభ్రంగా కడిగి, అందులో తాగడానికి పనికి వచ్చే విధంగా ఉన్న మంచి నీళ్లు పోయాలి. ఆ నీటిలో కొద్దిగా యాలకుల పొడి, పచ్చ కర్పూరం కలిపి సుగంధభరితం చేయాలి.
బ్రాహ్మణుడికి దానం:
ఈ నీటి పాత్రను (ఉదక భాండం) బ్రాహ్మణుడికి దక్షిణతో కలిపి దానం చేయాలి. మీ శక్తిని బట్టి 6, 11, 16 లేదా 116 రూపాయల దక్షిణ ఇవ్వవచ్చని చెబుతున్నారు.
వేసవి కాలపు దానాలు:
అలాగే అక్షయ తృతీయ వచ్చేది వేసవి కాలంలో కాబట్టి.. చెప్పుల జత, గొడుగు లేదా ధనాన్ని దానం చేయడం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయంటున్నారు.
గమనిక: ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv నిర్ధారించడం లేదు.
