Appalayagunta : చిన్నశేషవాహనంపై వేణుగోపాలస్వామి వారి అలంకారంలో ప్రసన్న వేంకటేశ్వర స్వామి

తిరుపతి జిల్లా  అప్పలాయ గుంటలో వేంచేసియున్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శనివారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ వేణుగోపాల స్వామివారి అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు.

Appalayagunta :  తిరుపతి జిల్లా  అప్పలాయ గుంటలో వేంచేసియున్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజైన శనివారం ఉదయం శ్రీనివాసుడు శ్రీ వేణుగోపాల స్వామివారి అలంకారంలో చిన్నశేష వాహనంపై అభయమిచ్చారు.

ఉదయం 8 నుండి 9 గంటల వరకు ఆలయ నాలుగు మాడవీధుల్లో స్వామి వారు విహరిస్తూ భక్తులను కటాక్షించారు.

శ్రీ ప్రసన్న వేంకటేశ్వరుడు ఒక్కరే ఐదు తలలు గల చిన్నశేష వాహనాన్ని అధిష్టించారు. చిన్నశేష వాహనం శ్రీవారి వ్యక్తరూపమైన పాంచభౌతిక ప్రకృతికి సంకేతం. కనుక ఈ వాహనం పంచభూతాత్మకమైన విశ్వానికి, అందులో నివసించే జీవునికి వరాలిస్తుంది. పంచశిరస్సుల చిన్నశేషుని దర్శనం మహాశ్రేయస్కరం అని భక్తుల విశ్వాసం.

ట్రెండింగ్ వార్తలు