దీపావళి.. చీకట్లను పారద్రోలే వెలుగు ఉత్సవం. చీకటి నుంచి వెలుగులోకి పయనించాలని దీపావళి పండుగ చెప్పే అర్థం. మన జీవితాల్లో వెలుగులను మనమే వెలిగించుకోవాలని చెప్పే పండుగ దీపావళి. వెలుగు అంటే సంతోషం. ఆనందోత్సాహాలతో చేసుకునే దీపావళి పండుగతో పర్యావరణాన్ని కాపాడుకునేలా ప్రతీ ఒక్కరూ దీపావళిని చేసుకోవాలి.
పండుగ అంటే ఏదో కొత్త బట్టలు కట్టుకుని..పిండి వంటలు చేసుకుని తినటమే కాదు..వాతావరణాన్ని మరింతగా కాపాడుకోవటం. పెద్ద పెద్ద శబ్దాలు వచ్చేలా కాకుండా ప్రశాంతమైన వాతావరణంలో దీపావళిని చేసుకోవాలి. శబ్ధకాలుష్యం..గాలి కాలుష్యం కాకుండా చూసుకోవాలి. జాగ్రత్త పడాలి. లేకుంటే పండుగ పేరుతో మన ప్రకృతిని మనమే నాశనం చేసుకున్నవాళ్లం అవుతాం. అది మానవాళికి ఏమాత్రం మంచిది కాదని ప్రతీ ఒక్కరూ గుర్తించుకోవాలి.
దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం. దీపావళి ప్రత్యేకత అదే. ముఖ్యంగా మట్టి ప్రమిదలతో సంప్రదాయబద్దంగా దీపావళి సంబరం చేసుకోవాలి. ధ్వని,పర్యావరణ కాలుష్యం లేని దీపావళి జరుపుకోవాలి. అందుకోసం ఏం చెయ్యాలో తెలుసుకుందాం..
మట్టి ప్రమిదలలో నూనె పోసుకోవాలి. నువ్వుల నూనె , కొబ్బరి నూనె, ఆలివ్ ఆయిల్, నెయ్యి ఇలా ఏదైనా నూనె పోసి దీపాలు వెలిగించాలి. దీప కాంతులతో ఇంటిని అలంకరించండి. ఆ శోభాయమానంగా వెలిగే దీపాలను చూస్తే మన మనస్సుకు చాలా సంతోషంగా ఉంటుంది. అంతేకాదు నూనెతో వెలిగించి దీపాలు చూస్తే కళ్లకు కూడా చాలా మంచిదని డాక్టర్లు చెబుతుంటారు.
ఎలక్ట్రిక్ దీపాల వెలుగులకు, ఆర్టిఫీషియల్ ప్లాస్టిక్ దీపాలకు నో ఎలక్ట్రిక్ బల్బులు , ఎల్ ఈడీ బల్బులకు, డెకరేషన్ బల్బులతో వచ్చే వెలుగులు మంచివి కాదు. వాటికి బదులుగా మట్టి ప్రమిదలతో నూనె పోసి పత్తితో చేసిన ఒత్తిలతో గానీ..వస్త్రంతో చేసిన ఒత్తిని గానీ వెలిగించాలి.
ఇంట్లో ఉన్న పిండి,పండ్లతోనే దీపాల తయారీ మేలు జరుగుతుంది. గోధుమ పిండి ప్రమిదలు, కొబ్బరి చిప్పలు, నిమ్మ,బత్తాయి,నారింజ తొక్కలతో ప్రమిదలు,సముద్రపు గవ్వలతోనూ పర్యావరణానికి హాని కలిగించని దీపాలు వెలిగించుకోండి. వీటివల్ల ఖర్చు కూడా చాలా తగ్గుతుంది. చూసే వారికి కూడా ప్రత్యేకంగా..అందంగా కనిపిస్తుంది. పర్యావరణానికీ మేలూ కలుగుతుంది. పండుగ ఏదైనా..మనిషికి ఆనందాన్ని ఇచ్చేలా ఉండాలి తప్ప..మానవాళికి ప్రమాదాన్ని కలిగించేది కాకుడదే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించుకోవాలి. మరి ఈ దీపావళి పండగను పర్యావరణ హితంగా జరుపుకోవాలని కోరుకుంటూ..అందరికీ దీపావళి శుభాకాంక్షలు..ఆనందాల దీపావళి మీ ఇళ్లల్లోను..జీవితాల్లోను సంతోషాలు ఇవ్వాలని కోరుకుంటూ మరోసారి అందరినీ దీపావళి శుభాకాంక్షలు..