నేడు రక్షా బంధన్.. ఏ సమయంలో రాఖీ కట్టాలి.. ఆ సమయంలో రాఖీ కట్టడం వల్ల ఏం జరుగుతుంది..?

శాస్త్రాల ప్రకారం.. భద్రకాలంలో సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదని, భద్రకాలం ముగిసిన తరువాత అపరాహ్నకాలంలో కట్టాలని పండితులు చెబుతున్నారు.

నేడు రక్షా బంధన్.. ఏ సమయంలో రాఖీ కట్టాలి.. ఆ సమయంలో రాఖీ కట్టడం వల్ల ఏం జరుగుతుంది..?

raksha bandhan 2025

Updated On : August 9, 2025 / 8:40 AM IST

Raksha Bandhan 2025: ‘రక్షా బంధన్’ తోబుట్టువులకు పవిత్రమైన పండుగ. సోదర సోదరీమణుల మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయతకు గుర్తుగా రక్షాబంధన్ జరుపుకుంటారు. నేడు (శనివారం) రాఖీ పౌర్ణమిని ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకుంటారు.

ఈ పవిత్రమైన రోజున అక్కాచెల్లెళ్లు తమ సోదరుల చేతికి రాఖీ కడతారు. స్వీట్లు తినిపించి ఆశీర్వాదాలు తీసుకుంటారు. ఈ క్రమంలో సోదరీమణులకు అండగా ఉంటామని అన్నాతమ్ముళ్లు వాగ్దానం చేస్తారు. కొందరు సోదరులు తమ అక్కాచెల్లెళ్లకు విలువైన బహుమతులు ఇచ్చి వారిపట్ల తమ ప్రేమను చాటుకుంటారు. అయితే, శనివారం రాఖీ పౌర్ణమి సందర్భంగా సోదరులకు రాఖీ ఏ సమయంలో కట్టాలి.. ఏ సమయంలో కడితే మంచి జరుగుతుంది అనే వివరాలను తెలుసుకుందాం..

ప్రతీఏడాది శ్రావణ మాసంలో వచ్చే తొలి పౌర్ణమి రోజునే రాఖీ పండుగ జరుపుకుంటారు. 2025 సంవత్సరానికి అనుగుణంగా ఈ పౌర్ణమి ఆగస్టు 9న (శనివారం) ఉంది. అందువల్ల రాఖీ వేడుకలను ఇవాళే జరుపుకుంటారు. అయితే, ఇది శ్రావణ మాసంలోని శుక్రవారం తరువాతిరోజు కావడం విశేషం.

శాస్త్రాల ప్రకారం.. భద్రకాలంలో సోదరీమణులు తమ సోదరుల చేతికి రాఖీ కట్టకూడదని, భద్రకాలం ముగిసిన తరువాత అపరాహ్నకాలంలో కట్టాలని పండితులు చెబుతున్నారు. భద్రకాలం సమయంలో ఏ శుభకార్యాలు చేసినా ఆటంకాలు ఏదురవుతాయని, అశుభం కలుగుతుందని నమ్ముతారు. అందుకే భద్రకాలం ముగిసిన తరువాత రాఖీ కట్టాలని చెబుతున్నారు.

కొందరు జ్యోతిష్య నిపుణుల ప్రకారం.. ఆగస్టు 9వ తేదీన మధ్యాహ్నం 12గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు రాఖీ కట్టేందుకు అత్యంత శుభకాలంగా చెబుతున్నారు. ఈ సమయంలో రాఖీ కడితే విష్ణుమూర్తి అనుగ్రహం లభించడంతో పాటు సోదరులు, సోదరీమణులు శాంతి, సౌభాగ్యంతో తమ బంధాన్ని మరింత బలపర్చుకుంటారని పండితులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.

ముఖ్య గమనిక : పైన తెలిపిన వివరాలు కొందరు నిపుణులు, వివిధ శాస్త్రాల్లో పేర్కొన్న అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. దీన్ని ఎంతవరకు విశ్వసించాలనేది పూర్తిగా మీ వ్యక్తిగత విషయం.