Karthika Somavaram : రెండు పర్వదినాలు ఒకేరోజు

తెలుగు రాష్ట్రాలు కార్తీకమాస శోభను సంతరించుకున్నాయి. ఇవాళ కార్తీకమాసం తొలి సోమవారంతో పాటు.. నాగుల చవితి కావడంతో శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి.

Karthika Somavaram Telugu States : తెలుగు రాష్ట్రాలు కార్తీకమాస శోభను సంతరించుకున్నాయి. ఇవాళ కార్తీకమాసం తొలి సోమవారంతో పాటు.. నాగుల చవితి కావడంతో శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. తెల్లవారు జాము నుంచే భక్తులు శివాలయాలకు పోటెత్తారు. దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక మాసంలోని మొదటి సోమవారం కావడంతో.. పంచారామ క్షేత్రమైన భీమవరంలోని సోమేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు.

Read More : Heavy Rains: తమిళనాడులో భారీ వర్షాలు, IMD ‘రెడ్’ అలర్ట్.. ఏపీలో దక్షిణ కోస్తా జిల్లాలపై ప్రభావం

శివయ్యకు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి వారి దర్శనం కోసం క్యూ కట్టారు. ఆలయ అధికారులు భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారు. మరోవైపు.. పాలకొల్లు, ద్వారకాతిరుమల శివాలయాలకు భక్తులు క్యూ కడుతుంటే.. పట్టిసీమ, కొవ్వూరు గోస్పాద క్షేత్రం, నరసాపురం గోదావరి దేవుల్లో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు.

Read More : Jawans Firing: జవాన్ల మధ్య గొడవ.. కాల్పులతో నలుగురు మృతి.. కారణం ఇదేనా..?

నాగుల చవితి, కార్తీక సోమవారం రెండూ ఒకే రోజు వచ్చాయి. తిరుమలలో శ్రీవారికి సోమవారం..సాయంత్రం పెదశేషవాహన సేవ నిర్వహించనున్నారు. నాగుల చవితి సందర్భంగా..పెదశేష వాహనంపై ఉభయ దేవేరులతో కలిసి మలయప్ప స్వామి దర్శనమివ్వనున్నారు. కపిలాశ్వరాలయంలో…శైవ క్షేత్రాలకు తెల్లవారుజామున భక్తులు పోటెత్తారు. శివ నామస్మరణతో ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. భక్తులకు ఎలాంటతి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు