Mohini Ekadashi 2026 : సోమవారం+మోహిని ఏకాదశి.. ఈ చిన్న పని చేస్తే చాలు.. అప్పుల భారం నుంచి బయట పడతారు..

Mohini Ekadashi 2026 : ఈసారి సోమవారం నాడు మోహిని ఏకాదశి తిథి వస్తుంది. ఈ రోజున కొన్ని ప్రత్యేక పరిహారాలు చేస్తే అప్పుల భారం నుంచి బయటపడవచ్చు అంటున్నారు.

Mohini Ekadashi 2026 Perform This Simple Remedy to Get Rid of Debt Burdens

Mohini Ekadashi 2026 : ఏప్రిల్ 27న మోహినీ ఏకాదశి పర్వదినం వస్తోంది. ఇది అత్యంత శక్తివంతమైన ఏకాదశి తిథి అని పండితులు అంటున్నారు. ఈరోజు తులసీమాతను, లక్ష్మీనారాయణులను పూజించి కొన్ని పరిహారాలు పాటిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని.. అప్పుల భారం తీరుతుందని పండితులు చెబుతున్నారు. సాధారణంగా హిందువులు తులసి మొక్కను చాలా పవిత్రంగా భావించడమే కాకుండా చాలా ప్రాధాన్యత ఇస్తారు. అందుకే మోహినీ ఏకాదశి అయిన సోమవారం నాడు.. తులసి మంజరి (ఎండిన పూత)తో కొన్ని పరిహారాలు పాటిస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు.

ఏం చేయాలంటే..

మోహినీ ఏకాదశి రోజున (2026 ఏప్రిల్​ 27) అయిన సోమవారం నాడు.. బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని శుభ్రంగా తల స్నానం చేసి ఉతికిన దుస్తులు ధరించాలి. అనంతరం తులసి చెట్టుకు ఉన్న ఎండిన మంజరిని సేకరించి.. ఒక ఎర్రటి వస్త్రంలో కొద్దిగా బియ్యం, పసుపు, కుంకుమ, అక్షింతలతో పూజ చేయాలి. ఆ తర్వాత ఆ వస్త్రాన్ని మూటలా కట్టి.. మహాలక్ష్మీ అమ్మవారిని ధ్యానించాలి. ఆ తర్వాత ఆ వస్త్రాన్ని విలువైన ఆభరణాలు దాచుకునే ప్రాంతం లేదా బీరువా, లాకర్ వంటి చోట్ల ఉంచాలి. ఇలా చేయడం వలన మీ ఇంట్లో ధన ప్రవాహం పెరిగి.. నిలిచిపోయిన డబ్బు తిరిగి వస్తుందని పండితులు చెబుతున్నారు.

అప్పుల భారంతో సతమతమవుతున్న వారికి మోహినీ ఏకాదశి పూజ ఒక అద్భుతమైన అవకాశం. ఆ రోజు (2026 ఏప్రిల్​ 27) సాయంత్రం పాలలో తులసి మంజరిని కలిపి శ్రీమహావిష్ణువుకు అభిషేకం చేయాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే.. జాతకంలో దేవగురువు బృహస్పతి బలపడతాడని అంటున్నారు. గురు గ్రహ అనుగ్రహం కలిగితే ఆదాయ మార్గాలు మెరుగుపడటమే కాకుండా.. అప్పుల ఊబి నుంచి త్వరగా బయటపడతారని చెబుతున్నారు. విశ్వాసంతో ఈ పరిహారాలను పాటిస్తే.. తప్పకుండా మెరుగైన ఫలితాలు లభిస్తాయని పండితులు చెబుతున్నారు.

గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv ధృవీకరించడం లేదు.