Guru Pushya Yoga 2026 : మే 21 గురువారం+గురు పుష్యమి యోగం.. పసుపుతో ఇలా చేస్తే.. తరతరాలకు తరగని ఐశ్వర్యం..!
Guru Pushya Yoga 2026 : మే 21 గురువారం గురు పుష్యమి యోగం ఏర్పడబోతుంది.
Guru Pushya Yoga 2026 Do this with turmeric Remedy for generations of unending wealth
Guru Pushya Yoga 2026 : మే 21 గురువారం నాడు చాలా అరుదుగా ఏర్పడే గురు పుష్యమి యోగం రాబోతుంది. గురువారం నాడు పుష్యమి నక్షత్రం ఏర్పడితే దాన్ని గురు పుష్యమి అని అంటారు. అలాగే ఈ రోజున పంచమి తిధి కూడా కలిసి వచ్చింది. ఈ గురు పుష్యమి నక్షత్రంలో ఏ పని చేసినా సరే అదృష్టం ఐశ్వర్యం కలిసి వస్తాయి. సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే ఈ గురు పుష్యమి యోగం ఏర్పడుతుంది. కాబట్టి ఇంతటి అద్భుతమైన గురు పుష్యమి యోగంలో కొన్ని వస్తువులను కొని మీ ఇంటికి తెచ్చుకుంటే అతి త్వరలోనే కోటీశ్వరులయ్యే అవకాశం ఉంటుంది.
ఈ నెల మే 21వ తేదీన చాలా అరుదుగా ఏర్పడే గురు పుష్యమి రాబోతుంది. ఈ రోజు బృహస్పతి ప్రభావం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ అమృత గడియల్లో కొన్ని వస్తువులను మీ ఇంటికి తెచ్చుకుంటే ఇక పట్టిందల్లా బంగారమే అవుతుందంటున్నారు పండితులు. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ గురు పుష్యమి నక్షత్రంలో కాస్త బంగారం కొన్నా సరే విపరీతమైన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అంటున్నారు. అయితే బంగారం కొనలేని వారు వెండి వస్తువులు కొనుగోలు చేసినా సరే ధన లాభం కలిసి వస్తుందని చెబుతున్నారు. అయితే ప్రస్తుతం బంగారం, వెండి కొనలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. అలాంటి వారు ఈ గురు పుష్యమి యోగంలో పసుపు కొని మీ ఇంటికి తెచ్చుకుంటే ఊహించలేనంత సంపద మీ ఇంటికి తరలి వస్తుందని పండితులు చెబుతున్నారు.
పసుపుతో ఇలా చేస్తే..
ఈ గురు పుష్యమి నక్షత్రంలో పసుపు కొంటే లక్ష్మీదేవి మీ ఇంట్లోకి తరలి వస్తుందని చెబుతున్నారు. కనుక ఈ గురుపుష్యమి నాడు.. ఒక్క ఐదు రూపాయల పసుపు ప్యాకెట్ మీ ఇంటి ఐశ్వర్యాన్ని రెట్టింపు చేస్తుంది. ఈరోజు పసుపు కొని మీ పూజ గదిలో పెట్టి విష్ణుమూర్తిని, లక్ష్మీదేవిని పూజిస్తే తరతరాల తరగని ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అలాగే ఈ గురుపుష్యమి నక్షత్రంలో పసుపు రంగులో ఉన్న ఏ వస్తువులను కొన్నా సరే ధనప్రాప్తి కలుగుతుంది.
అప్పుల భారం తీరాలంటే..
ఈ గురుపుష్య యోగంలో దీపారాధన చేయడం వల్ల ఆ ఇంట్లో తరతరాల పాటు అష్టైశ్వర్యాలతో, ఆయురారోగ్యాలతో వర్థిల్లుతారని పండితులు చెబుతున్నారు. అలానే విపరీతమైన అప్పుల బాధలతో ఇబ్బంది పడేవారు ఇప్ప నూనెతో దీపారాధన చేయడం వల్ల మీ అప్పులన్నీ త్వరగా తీరిపోతాయి.
ఇలా లక్ష్మీ నారాయణులను పూజిస్తూ ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఇలా ఇంట్లో పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి ఫోటో ముందు రెండు యాలకులు పెట్టి, పూజ పూర్తయిన తర్వాత ఈ యాలకులను తీసి మీ పర్సులో కానీ మీ బీరువాలో కానీ పెట్టుకోండి. తద్వారా అనవసరపు ఖర్చులు తగ్గి.. డబ్బు కష్టాలు మొత్తం తొలగిపోయి మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది. అలాగే తీవ్రమైన అప్పుల బాధల నుండి త్వరగా విముక్తి పొందాలంటే ఒక దారానికి 11 యాలకులను గుచ్చి, ఆ యాలకుల మాలను లక్ష్మీదేవి పటానికి వేసి నమస్కారం చేసుకోండి. యాదృచ్చికంగా మీ అప్పులన్నీ వెంటనే తీరిపోతాయి.
ముఖ్య పరిహారాలు:
- ఈ గురు పుష్యమి నక్షత్రంలో కొత్త చీపురును కొని శనివారం నుండి వాడడం ప్రారంభిస్తే మీ ఇంట్లోని దరిద్రం మొత్తం వెంటనే వదిలిపోతుంది.
- అలాగే ఈ పుష్యమి నక్షత్రంలో కొత్త రాగి వస్తువులు లేదా ఇత్తడి వస్తువులను కొనుగోలు చేస్తే అన్నపూర్ణ దేవి అనుగ్రహంతో మీ ఇంట్లో ధన ధాన్యాలకు కొరత లేకుండా ఉంటుంది.
- అలాగే ఈ గురు పుష్యమి నాడు ఉదయాన్నే స్త్రీలు తలస్నానం చేసి తులసి మొక్క మొదట్లో కొన్ని పచ్చిపాలు కలిపిన నీటిని సమర్పించి, తులసికోట దగ్గర నెయ్యి దీపం వెలిగించాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దరిద్రం తొలగిపోయి లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది.
- అలానే ఆడవారు ప్రతి ఒక్కరు ఈ గురుపుష్యమి యోగంలో ఒక తెలుపు రంగు దారానికి పసుపు రాసి, ఆ పసుపు దారాన్ని తులసి కొమ్మకు కడితే.. వివాహం కాని వారికి వివాహ యోగం, అలాగే వివాహమైన స్త్రీలకు దీర్ఘ సుమంగళ యోగం కలుగుతుంది.
గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం కేవలం పాఠకుల ఆసక్తి మేరకు ఇవ్వడం జరిగిది. దీన్ని 10tv నిర్ధారించడం లేదు.
