అయ్యప్పభక్తులకు ముస్లింల అన్నదానం

అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములకు అన్నదానం చేసి ముస్లీంలు మతసామరస్యాన్ని చాటుకున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరులో కులమతాలకు అతీతంగా అయ్యప్ప భక్తులకు అన్నదానం నిర్వహించారు.

  • Publish Date - December 19, 2019 / 09:16 AM IST

అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములకు అన్నదానం చేసి ముస్లీంలు మతసామరస్యాన్ని చాటుకున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరులో కులమతాలకు అతీతంగా అయ్యప్ప భక్తులకు అన్నదానం నిర్వహించారు.

అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములకు అన్నదానం చేసి ముస్లీంలు మతసామరస్యాన్ని చాటుకుంటున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో అయ్యప్పభక్తులకు ముస్లీంలు అన్నదానం చేస్తున్నారు. హిందూ, ముస్లీంల ఐక్యతకు మారుపేరుగా నిలుస్తున్నారు. వనపర్తి జిల్లా ఆత్మకూరులో కులమతాలకు అతీతంగా అయ్యప్ప భక్తులకు అన్నదానం నిర్వహించారు. 

అమరచింతలో అయ్యప్పస్వామి సన్నిధానంలో నయ్యర్ పాషా, అతని కుటుంబ సభ్యులు గురువారం (డిసెంబర్ 19, 2019) అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మతసమరస్యానికి ప్రతీకగా శబరిమలై వెళ్లే ప్రతి ఒక్క అయ్యప్ప భక్తుడు.. ఏరిమెలిలో ఉన్న వావరు స్వామిని దర్శించుకున్న తరువాతే అయ్యప్ప స్వామిని దర్శించుకుంటారని నయ్యర్ పాషా అన్నారు.

మంగళవారం (డిసెంబర్ 17, 2019) నిర్మల్ జిల్లా ఖానాపూర్‌‌కు చెందిన ఎండీ జమీల్.. స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో స్వాములకు, భక్తులకు అన్నదానం చేశాడు. ఈ ఆలయంలో ఏటా ఈ సంప్రదాయం కొనసాగుతున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రతి సంవత్సరం ముస్లిం వర్గానికి చెందిన ఓ వ్యక్తి అయ్యప్ప స్వాములకు అన్నదానం చేస్తూ మతసామరస్యాన్ని చాటుతున్నట్లు భక్తులు తెలిపారు.
 

ట్రెండింగ్ వార్తలు