Simhachalam Giri Pradakshinam
Giri Pradakshina : విశాఖజిల్లా సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి పౌర్ణమి గిరి ప్రదక్షిణ రద్దుచేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. రాష్ట్రంలో నైట్ కర్ప్యూ అమల్లో ఉన్నందును ఆషాఢ పౌర్ణమి రోజు జులై23న, సింహాచలంలోని శ్రీశ్రీశ్రీ వరాహలక్ష్మీనృసింహస్వామివారి గిరి ప్రదక్షిణ రద్దు చెస్తున్నట్లు ఈవో సూర్యకళ చెప్పారు.
కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో భక్తుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నామని… భక్తులెవ్వరూ పగటి పూట కూడా గిరి ప్రదక్షిణ చేయవద్దని కోరారు. ఈ నెల 23, 24వ తేదీల్లో కరోనా నిబంధనలు పాటిస్తూ స్వామివారి దర్శనాలకు మాత్రమే అనుమతి ఉంటుదని.. 23వ తేదీన శ్రీస్వామివారి మాస జయంతి… 24వ తేదీన తుది విడత చందన సమర్పణ ఉంటాయని ఈవో తెలిపారు.