Ganesh Navratri: నవరాత్రుల్లో పూజించే ‘గణపతి విగ్రహం’ ఎలా ఉండాలి? శాస్త్రాలు ఏం చెబుతున్నాయి.. స్వామీ రూపం వెనుక అసలు నిజాలు?

గణపయ్య(Ganesh Navratri) విగ్రహం ఏ విధంగా ఉండాలనే దానిపై స్పష్టమైన శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి.

Specialities of the Ganesha idol worshipped during Navratri.

  • శాస్త్ర ప్రమాణాల ప్రకారం గణపతి
  • మోదకం జ్ఞానానికి మహత్తర సంకేతం
  • ఎరుపు పుష్పాలు అత్యంత మంగళకరం

Ganesh Navratri: భారతీయ సనాతన ధర్మంలో గణేశ నవరాత్రులకు అత్యంత విశిష్టమైన స్థానం ఉంది. ప్రస్తుతం కాలానికి అనుగుణంగా మార్కెట్‌లో వివిధ రూపాలు, డిజైన్లలో వినాయకుడి విగ్రహాలు లభిస్తున్నప్పటికీ, పూజించే గణపయ్య విగ్రహం ఏ విధంగా ఉండాలనే దానిపై స్పష్టమైన శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి. ముద్గల పురాణం, ఆగమాలు, శిల్పశాస్త్రాలు, ప్రాచీన గ్రంథాల ప్రకారం భక్తులు ఇంట్లో లేదా పందిళ్లలో ప్రతిష్టించే ప్రతిమకు నిర్దిష్టమైన ఆధ్యాత్మిక అర్ధాలు ఉన్నాయి. విగ్రహ రూపం వెనుక ఉన్న అంతరార్థాన్ని తెలుసుకుని పూజించడం వల్ల ఆటంకాలు తొలగి ఆయురారోగ్యాలు సిద్ధయిస్తాయి.

i Phone 18Pro: ఐఫోన్ 18 ప్రో సిరీస్ లో కెమెరా అద్భుతం.. మెకానికల్ వేరియబుల్, 8x ఆప్టికల్ జూమ్.. ఈ ఫీచర్స్ తెలిస్తే మతిపోతుంది!

ఆయుధాలు, భంగిమలు.. భక్తులకు లభించే వరాలు:

శాస్త్రాల ప్రకారం గణనాథుని (Ganesh Navratri)చేతుల్లోని ఆయుధాలు కేవలం అలంకారం కావు, అవి ఆధ్యాత్మిక సంకేతాలు. విఘ్నేశ్వరుడి చేతిలోని ‘పాశం’ మానవుడి సంసార బంధనాలు, మోహాలను తొలగించడానికి, ‘అంకుశం’ మనుషులలో ఉండే చెడు ఆలోచనలు, అహంకారాన్ని నియంత్రించడానికి తోడ్పడతాయి. ఇక దేవుడి ‘వరదముద్ర’ భక్తులకు అభయాన్ని, శుభాలను వరంగా ప్రసాదిస్తే, ఆయన ధరించే ‘రక్ష వస్త్రాలు’ భక్తి శ్రద్ధలకు, సమగ్ర మంగళానికి ప్రతీకగా నిలుస్తాయి.

చిహ్నాలు, స్వరూపం.. జ్ఞానానికి, త్యాగానికి ప్రతిరూపం:

శిల్పశాస్త్రం ప్రకారం స్వామివారి విరిగియున్న ‘ఏకదంతం’ సృష్టి కోసం చేసిన మహత్తర త్యాగాన్ని సూచిస్తుంది. చేతిలో ఉండే ‘మోదకాలు’ కేవలం నైవేద్యం మాత్రమే కాక పరమాత్మ అందించే ఆనందకరమైన జ్ఞానానికి సంకేతం. అలాగే ‘లంబోదరం’ లేదా విశాలమైన బొజ్జ సమస్త బ్రహ్మాండ సృష్టి శక్తిని తనలో ఇముడ్చుకున్న రూపానికి నిదర్శనం. ప్రతిమ వద్ద ఉండే ‘మూషిక ధ్వజం’ లేదా ఎలుక వాహనం మనిషి యొక్క మనో నిగ్రహాన్ని, చంచలత్వాన్ని అదుపులో ఉంచడాన్ని సూచిస్తుంది.

పూజా విధానం.. మంగళకరమైన రక్త పుష్పాలు:

లంబోదరుడిని పూజించే సమయంలో ఎరుపు రంగు లేదా ‘రక్త పుష్పాలు’ ఉపయోగించడం అత్యంత శుభప్రదమని ఆగమ శాస్త్రాలు స్పష్టం చెప్తున్నాయి. ఎరుపు రంగు మంగళకరమైన శక్తికి, చైతన్యానికి ప్రతీకగా నిలుస్తుంది. నవరాత్రుల సందర్భంగా పూజించే విగ్రహం శాస్త్రబద్ధమైన ఈ లక్షణాలతో రూపుదిద్దుకున్నప్పుడు మాత్రమే పూర్తిస్థాయి ఆత్మశాంతి, దైవిక అనుగ్రహం లభిస్తాయి. ఆడంబరాల కంటే శాస్త్ర ప్రమాణాలకు ప్రాధాన్యతనిచ్చి విఘ్నేశ్వరుడిని ఆరాధించడం శ్రేయస్కరం.