Varalakshmi Vratham 2023 : తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ మాస సందడి.. భక్తులతో కిటకిటలాడుతున్న దేవాలయాలు

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. పలు నగరాల్లో ప్రముఖ దేవాయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. ప్రతి లోగిలి వరలక్ష్మీ అమ్మవారి పూజలు, నోములతో కళకళలాడుతున్నాయి.

Varalakshmi Vratham 2023

Varalakshmi Vratham 2023 : తెలుగు రాష్ట్రాల్లో శ్రావణ మాసం సందడి నెలకొంది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా పలు నగరాల్లోని ప్రముఖ దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. వరలక్ష్మీ అమ్మవారికి ప్రత్యేక పూజలు, నోములతో ప్రతి లోగిలి కళకళలాడుతోంది.

Varalakshmi Vratham: ఈ రోజు వరలక్ష్మీ వ్రతం.. వరలక్ష్మీ వ్రతానికి సంబంధించిన ప్రత్యేక కథనాలు చదవండి

వరలక్ష్మీ వ్రతం సందర్భంగా తెలుగు రాష్ట్రాలు సందడిగా ఉన్నాయి. పలు దేవాలయాలు భక్తులతో రద్దీగా ఉన్నాయి. పూజా స్టోర్ లు అమ్మవారి విగ్రహాలతో కళకళలాడుతున్నాయి. అమ్మవారి కిరీటాలు, పూలజడలు, కుందులు, రంగోలీ మేట్స్, డెకరేటివ్ ఐటమ్స్ అందుబాటులో ఉంచారు.ముత్తైదువులు ఎంతో భక్తితో జరుపుకునే ఈ పండుగకు ఎంతో విశిస్టత ఉంది. అమ్మవారిని పసుపుతో అలంకరించి వారి స్థోమతను బట్టి విగ్రహాన్ని సిద్ధం చేసుకుంటారు. భక్తి శ్రద్ధలతో పూజ చేసుకుని వాయినాలు ఇచ్చుకుంటారు. ఈ రోజు అమ్మవారిని పూజిస్తే సకల సంపదలు, ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి.

Varalakshmi Vratham 2023 : వరలక్ష్మీదేవిని పూజించండి.. కరుణా కటాక్షాలు పొందండి.. పూజా విధానం, నియమాలు మీకోసం

విజయవాడలోని ఇంద్రకీలాద్రి భక్తులతో రద్దీగా ఉంది. అధిక సంఖ్యలో భక్తులు వస్తుండటంతో అధికారులు తగిన ఏర్పాట్లు చేసారు. సెప్టెంబర్ 8 వ తేదీన ఇంద్రకీలాద్రిపై సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. తిరుపతిలో కూడా ఈరోజు భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. హైదరాబాద్ జూబ్లిహిల్స్ లోని పెద్దమ్మ టెంపుల్ భక్తులతో కిటకిటలాడుతోంది. సకల శుభాలు కలగాలని భక్తులు భక్తిశ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తున్నారు.