Tirumala Alert : బైకుపై తిరుమల వెళ్తున్నారా..? టూవీలర్లకు నో ఎంట్రీ.. ఎక్కడ పార్కింగ్ చేయాలో తెలుసా?

Tirumala Alert : తిరుమల గరుడ సేవ సందర్భంగా ఘాట్ రోడ్డుపై ద్విచక్ర వాహనాలపై ఆంక్షలను విధించారు. పార్కింగ్ ప్రాంతాలు, ఆర్టీసీ బస్సులు, ట్రాఫిక్ మళ్లింపుల పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published on- September 20, 2026 / 05:29 PM IST

Tirumala Alert

  • తిరుమల భక్తులకు అలర్ట్..
  • గరుడ సేవకు లక్షలాది భక్తులు..
  • తిరుమలలో ట్రాఫిక్ ఆంక్షలు కఠినం
  • ఘాట్ రోడ్డుపై ద్విచక్ర వాహనాలకు నో ఎంట్రీ

Tirumala Alert : శ్రీవారి బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఈ అద్భుతమైన వేళలో తిరుమలకు వెళ్లే భక్తులకు పోలీసులు, టీటీడీ కీలక సూచనలు జారీ చేశారు. బ్రహ్మోత్సవాల్లో అత్యంత విశేషమైన గరుడ వాహన సేవను వీక్షించేందుకు దేశ, విదేశాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు. ఈ సందర్భంగా (Tirumala Alert) తిరుమలలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ కోసం ప్రత్యేక చర్యలు చేపట్టారు.

గరుడ సేవ సందర్భంగా ఘాట్ రోడ్డుపై ద్విచక్ర వాహనాల రాకపోకలపై పూర్తి నిషేధం విధించారు. శుక్రవారం రాత్రి 9 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు బైకులు, స్కూటర్లను ఘాట్ రోడ్డులో అనుమతించరు. తద్వారా తిరుమలకు ద్విచక్ర వాహనాలపై వెళ్లే భక్తులు ముందుగానే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది.

Read Also : APPSC FSO Recruitment 2026 : ఏపీలో జాబ్స్ పడ్డాయ్.. డిగ్రీ పాసైనా వారికే ఛాన్స్.. అప్లయ్ చేసే డేట్ ఇదే..!

ప్రత్యేక పార్కింగ్ స్థలాలు :
తిరుపతిలోని బాలాజీ లింక్ బస్టాండ్, నెహ్రూ మున్సిపల్ గ్రౌండ్, ఎస్వీ మెడికల్ కాలేజ్ గ్రౌండ్, ఇస్కాన్ మైదానం వంటి ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. అక్కడ వాహనాలను పార్క్ చేసి, ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో తిరుమలకు చేరుకోవాలని అధికారులు సూచించారు.

అదేవిధంగా, ప్రైవేటు కార్లు, టూరిస్ట్ బస్సుల కోసం భారతీయ విద్యాభవన్, అలిపిరి లింక్ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో పార్కింగ్ ఏర్పాట్లు చేశారు. భక్తుల రద్దీని నియంత్రించేందుకు పలు మార్గాల్లో వాహనాలను మళ్లించనున్నారు. అందుకే గరుడ సేవకు వచ్చే భక్తులు చివరి నిమిషంలో ఇబ్బందులు పడకుండా ట్రాఫిక్ ఆంక్షలు, పార్కింగ్ నిబంధనలను ముందుగానే తెలుసుకుని ప్రయాణించాలని అధికారులు సూచిస్తున్నారు.