Tirumala : తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. జూన్ నెల కోటా షెడ్యూల్ వచ్చేసింది.. ఇలా బుక్ చేస్కోండి.. ఫుల్ డీటెయిల్స్

Tirumala : తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకోసం ప్రతినెలా టీటీడీ ఆర్జిత సేవలు, దర్శనాలు, గదులకు సంబంధించి ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోంది. తాజాగా.. జూన్ నెలకు సంబంధించిన ఆర్జితసేవలు, వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలను విడుదల చేసింది.

Tirumala tirupati devasthanam

  • తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక
  • జూన్ నెల కోటా షెడ్యూల్ విడుదల
  • ఈనెల 18వ తేదీ నుంచి బుకింగ్స్ ప్రారంభం

Tirumala : తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకోసం ప్రతినెలా టీటీడీ (TTD) ఆర్జిత సేవలు, దర్శనాలు, గదులకు సంబంధించి ఆన్‌లైన్ కోటాను విడుదల చేస్తోంది. తాజాగా.. జూన్ నెలకు సంబంధించిన ఆర్జితసేవలు, వివిధ దర్శనాల, గదుల కోటా వివరాలను విడుదల చేసింది. అయితే, మార్చి 18వ తేదీ ఉదయం 10గంటల నుంచి బుకింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. శ్రీ‌వారి ఆర్జిత‌సేవ‌లు, ద‌ర్శన టికెట్లను https://ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా బుక్ చేసుకోవాల‌ని టీటీడీ కోరింది.

Also Read : Tamil Nadu Politics : తమిళనాడులో ఎన్డీయే కూటమిలోకి టీవీకే..? క్లారిటీ ఇచ్చిన పవన్ కల్యాణ్..

♦ తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల (సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన సేవ)కు సంబంధించిన కోటాను మార్చి 18వ తేదీన ఉదయం 10గంటలకు టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది. మార్చి 20వ తేదీ ఉదయం 10గంటల వరకు ఈ సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ డిప్ కోసం ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చునని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. అయితే, ఈ టికెట్లను పొందిన వారు మార్చి 20వ తేదీ నుంచి మార్చి 22 వ తేదీ మధ్యాహ్నం 12గంటల వరకు సొమ్ము చెల్లించాలి. గడువులోగా నగదు చెల్లించిన వారికే టికెట్లు మంజూరు అవుతాయి.

Also Read : Gold Price Today : భారీగా పడిపోయిన బంగారం ధర.. రాత్రికిరాత్రే ఢమాల్.. తులం గోల్డ్‌పై ఎంత తగ్గిందంటే? ఫుల్ డీటెయిల్స్ ఇక్కడ..

♦ ఈనెల 21వ తేదీ ఉదయం 10గంటలకు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవ, జ్యేష్టాభిషేకం టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
♦ ఈనెల 21న మధ్యాహ్నం 3గంటలకు వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
♦ ఈనెల 23న ఉదయం 10గంటలకు అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది.
♦ ఈనెల 23న ఉదయం 11గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది.
♦ ఈనెల 23వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు వయోవృద్ధులకు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులున్నవారు తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వీలుగా ఉచిత ప్రత్యేక దర్శనం టోకెన్ల కోటాను టీటీడీ ఆన్‌లైన్‌లో విడుదల చేయనుంది.
♦ ఈనెల 24వ తేదీ ఉదయం 10గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది.
♦ ఈనెల 24వ తేదీ మధ్యాహ్నం 3గంటలకు తిరుమల, తిరుపతిలలో గదుల కోటాను ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని టీటీడీ కోరింది.