Sri Varaha Swamy Temple
Sri Varaha Swamy Temple : తిరుమల శ్రీ వరాహ స్వామి ఆలయంలో దర్శనాలు ప్రారంభం అయ్యాయి. 624 రోజుల తర్వాత వరాహ స్వామి ఆలయంలో దర్శనాలను టీటీడీ ప్రారంభించింది. కరోనా కారణంగా 2020 మార్చి 20 నుండి శ్రీ వరాహ స్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేశారు.
ఆలయ విమాన గోపురానికి రాగి రేకుపై బంగారం పూత, మహా సంప్రోక్షణ చేశారు. అనంతరం స్వామి వారి ఆలయంలో దర్శనాలకు టీటీడీ అనుమతి ఇచ్చింది.
Hot Water : చలికాలంలో వేడి నీటి స్నానం మంచిదేనా?
తిరుమల కొండపై వేంకటేశ్వరస్వామి ఆలయానికి ఉత్తర దిశగా పుష్కరిణిని ఆనుకుని శ్రీ భూవరాహ స్వామి ఆలయం ఉంది. బ్రహ్మపురాణం ప్రకారం తిరుమల ఆది వరాహ క్షేత్రం. ఇక్కడ ఉన్న వరాహస్వామి వారిని దర్శించుకున్న తర్వాతే శ్రీవారిని దర్శించుకోవాలని స్థల పురాణం.
Hemoglobin : రక్తంలో హిమోగ్లోబిన్‌ను పెంచే 3 రకాల ఆహారాలు ఇవే..!