Hot Water : చలికాలంలో వేడి నీటి స్నానం మంచిదేనా?

సైన‌స్‌, మైగ్రేన్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు ఉంటారు. చ‌లికాలంలో చ‌న్నీటితో స్నానం చేస్తే వారి స‌మ‌స్య మ‌రింత ఎక్కువ అవుతుంది.

Hot Water : చలికాలంలో వేడి నీటి స్నానం మంచిదేనా?

Bathing Hot Water (1)

Hot Water  : మ‌నం శుభ్రంగా ఉండాలంటే రోజూ స్నానం చేయాల్సిందే. స్నానం చేయ‌డం వ‌ల్ల మ‌న‌స్సు ప్ర‌శాంతంగా మారుతుంది. హాయిగా ఉంటుంది. చ‌లికాలంలో స‌హ‌జంగానే చాలా మంది వేడి నీళ్ల‌తో స్నానం చేస్తుంటారు. వేస‌వి కాలంలో చ‌న్నీళ్ల స్నానం ఎంతో హాయినిస్తుంది. ఈ క్ర‌మంలోనే కాలాల‌కు అనుగుణంగా ఎవ‌రైనా స్నానం చేస్తారు. అసలు స్నానానికి వేడి నీరు మంచిదా..చల్లటి నీరు మంచిదా చాలామందికి వచ్చే సందేహం వస్తుంది. చ‌లికాలంలో వేన్నీళ్ల స్నానం చేయ‌డం వ‌ల్ల శ‌రీరానికి వెచ్చ‌ద‌నం ల‌భిస్తుంది. అంతేకాదు, హాయిగా కూడా ఉంటుంది. చ‌లి నుంచి దూరంగా ఉండ‌వ‌చ్చు. అయితే చ‌లికాలంలో వేన్నీళ్ల స్నానం చేయ‌డం మంచిదే.. కానీ దాంతో కొన్ని స‌మ‌స్య‌లు ఉంటాయ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

చ‌లికాలంలో వేన్నీళ్ల స్నానం చేయ‌డం వ‌ల్ల చ‌లికి దూరంగా ఉండొచ్చు. హాయిగా ఉంటుంది. ఒత్తిడి త‌గ్గుతుంది. బాగా మరిగిన నీటితో స్నానం చేయడం కంటే గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం మంచిదట. దాని వల్లే ప్రయోజనాలు ఎక్కువగా ఉంటాయి. అయితే వేడి నీటితో స్నానం చేయడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. గోరు వెచ్చని నీటితో స్నానం చేయడం వల్ల రక్త ప్రవాహం మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు.

గుండె జబ్బులతో బాధపడేవారు వేడి నీటి స్నానం చేయడం ఉత్తమం. బరువు తగ్గాలనుకొనేవారు వేడి నీటితో స్నానం చేయడం మంచిదే. శరీరం అధిక ఉష్ణోగ్రతలకు గురైనప్పుడు రక్తనాళాలు విస్తరిస్తాయి. ఫలితంగా రక్త ప్రవాహం మెరుగుపడుతుంది. కీళ్ళు, కండరాలకు వేడి నీళ్లు ఉపశమనం కలిగిస్తాయి. వేడి నీటి వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. వేడి నీటితో స్నానం వల్ల హాయిగా నిద్రపడుతుంది. వేడి నీటి స్నానం వల్ల శరీరంపై ఉండే ఏమైనా బ్యాక్టీరియా, క్రిములు ఉంటే బయటకు పోతాయి.

వేడి నీటి స్నానం వల్ల రక్త సరఫరా పెరగడం, రక్తపోటు తగ్గడం వంటివి జరుగుతున్నాయని, అందువల్లే గుండె సమస్యలు తగ్గాయని తెలిపారు. వేడి నీటి స్నానం గురించి ఫాల్కనర్‌ మరో పరిశోధనలో తేలింది. రాత్రిపూట వేడినీటితో స్నానం చేయ‌డం మంచిది. గోరువెచ్చ‌టి నీటితో స్నానం చేయ‌డం వ‌ల్ల శ‌రీరం, కండ‌రాలు మొత్తం రిలాక్స్ అవుతాయి. దీనివ‌ల్ల పొద్దుట్నుంచి ప‌నిచేసి అల‌సిపోయిన శ‌రీరానికి ఉప‌శ‌మనం ల‌భిస్తుంది. హాయిగా నిద్ర‌ప‌డుతుంది. కాబ‌ట్టి రాత్రిపూట మాత్రం చ‌న్నీళ్ల కంటే వేడినీటితో స్నానం చేయ‌డ‌మే ఉత్తమం.

సైన‌స్‌, మైగ్రేన్ వంటి స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డేవారు ఉంటారు. చ‌లికాలంలో చ‌న్నీటితో స్నానం చేస్తే వారి స‌మ‌స్య మ‌రింత ఎక్కువ అవుతుంది. త‌ల‌ప‌ట్టేసిన‌ట్టు ఉండ‌ట‌మే కాకుండా త‌ల‌నొప్పి కూడా పెరుగుతుంది. కాబ‌ట్టి వాళ్లు చ‌లికాలంలో వేడినీటితో స్నానం చేయ‌డ‌మే మంచిది.

చ‌లికాలంలో కొంద‌రు ఎక్కువ సేపు వేన్నీళ్ల స్నానం చేస్తుంటారు. ఇది మంచిది కాద‌ని వైద్యులు చెబుతున్నారు. వేన్నీళ్ల‌లో ఎక్కువ సేపు ఉండ‌డం వ‌ల్ల చ‌ర్మం, శిరోజాల‌పై ఉండే స‌హ‌జ‌సిద్ధ‌మైన నూనెలు పోతాయి. దీంతో ఆయా భాగాలు పొడిగా మారుతాయి. ఈ క్ర‌మంలో చ‌ర్మం పొడిగా మారి ప‌గిలి దుర‌ద‌లు పెడుతుంది. అలాగే శిరోజాలు పొడిగా మారి రాలిపోతాయి.

అందువ‌ల్ల వేన్నీళ్ల‌తో ఎక్కువ సేపు స్నానం చేయ‌వ‌ద్దు. ఒక మోస్త‌రుగా ఉండే వేడినీళ్ల‌తోనే స్నానం చేయాలి. అది కూడా 10 నిమిషాల‌లోపే స్నానం ముగించాలి. దీంతో చ‌ర్మం, శిరోజాల‌ను ఆరోగ్యంగా ఉంచుకోవ‌చ్చ‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.