Vaishakha Purnima 2026 : వైశాఖ పౌర్ణమి నాడు పచ్చ కర్పూరంతో ఇలా చేస్తే.. మీ కష్టాలన్నీ పరార్..!

Vaishakha Purnima 2026 : వైశాఖ పూర్ణిమ నాడు పచ్చకర్పూరంతో పరిహారం చేస్తే కష్టాలన్నిన తొలగిపోతాయంటున్నారు.

Vaishakha Purnima 2026 If you do this with Green Camphor Pacha Karpooram all your troubles will vanish

Vaishakha Purnima 2026 : మే 1, శుక్రవారం నాడు వైశాఖ పూర్ణిమ. ఈ వైశాఖ పౌర్ణమి రోజున విష్ణుమూర్తిని వసంత మాధవుడుగా ఆరాధించాలంటున్నారు పండితులు. ఈ పౌర్ణమి రోజు సాయంత్రం (సంధ్యా సమయంలో) ఈ పూజ చేయడం శ్రేష్ఠం అని చెబుతున్నారు.

పచ్చకర్పూరంతో..

వైశాఖ పూర్ణిమ నాడు పచ్చకర్పూరంతో విష్ణుమూర్తిని ఆరాధిస్తే చాలా మంచిది అంటున్నారు. ఇందుకోసం విష్ణుమూర్తి ఫోటో ముందు కలశం పెట్టుకుని, తులసిమాల వేయాలి. పచ్చకర్పూరం, ఇతర సువాసన ద్రవ్యాలతో పూజా పరిసరాలు మనోహరంగా ఉండేలా చూసుకోవాలి.

విష్ణు సహస్రనామ పారాయణ:

ఈ సమయంలో విష్ణు సహస్రనామాలను పఠించడం లేదా శ్రద్ధగా వినడం వల్ల అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి.

భగవంతుడితో సంభాషణ (కీలక అంశం):

భగవంతుడిని కేవలం కోరికలు కోరడం కాకుండా, మన సొంత మనిషితో మాట్లాడినట్లు మనసు విప్పి మాట్లాడాలి. తల్లిదండ్రుల వద్ద అలిగి, సాధించుకున్నట్లు పరమేశ్వరుడి దగ్గర కూడా అలానే చేయాలంటున్నారు. ఇలా పది రోజులు భగవంతుడితో మాట్లాడటం మొదలుపెడితే, 11వ రోజు నుండి మీ జీవితంలో మార్పులు జరగడం చూస్తారు.

భగవంతుడు మీ మొర వింటున్నాడని ఇలా తెలుస్తుంది:

పూజ ప్రారంభించే ముందు భగవంతుని ఫోటో పాదాల దగ్గర ఒక గుండ్రని పుష్పాన్ని (చామంతి లేదా గులాబీ) ఉంచాలి. మీరు మనసులోని మాటలన్నీ చెప్పి, ఆయనతో మాట్లాడిన తర్వాత ఆ పుష్పాన్ని గమనిస్తే, అది ఇంకా విచ్చుకున్నట్లు కనిపిస్తుంది. ఇది భగవంతుడు మీ మాట వింటున్నారనేదానికి నిదర్శనం. కావున ఈ వైశాఖ పూర్ణిమ నాడు మంచి మనసుతో ఆ భగవంతుడిని ఆరాధిస్తే.. మీ కష్టాలన్నీ తొలగుతాయంటున్నారు.

గమనిక : ఇక్కడ ఇచ్చిన సమాచారం పాఠకుల ఆసక్తిమేరకు ఇవ్వడం జరిగింది. దీన్ని 10tv ధ్రువీకరించడం లేదు.