×
Ad

Kanipakam : కాణిపాకంలో వరసిధ్ధి వినాయక వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం

చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం లో వెలసిన స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈరోజు వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

  • Published On : September 10, 2021 / 03:33 PM IST

Kanipakam

Kanipakam :  చిత్తూరు జిల్లా ఐరాల మండలం కాణిపాకం లో వెలసిన స్వయంభూ శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయంలో ఈరోజు వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆలయంలో నేటి నుంచి 10 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు, 11 రోజుల పాటు ప్రత్యేక ఉత్సవాలు జరగనున్నాయి. వినాయక చవితి వేడుకల్లో భాగంగా రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం తరుఫున ఈరోజు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు.

స్వామి వారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి దంపతులు

బ్రహ్మోత్సవాల్లో భాగంగా
10వ తేదీన వినాయక చవితి
11న ఉదయం ధ్వజారోహణం, రాత్రి హంసం వాహన సేవ
12న నెమలి వాహనం
13న మూషిక వాహనం
14న శేషవాహనం
15న ఉదయం చిలుక వాహనం, రాత్రి వృషభ వాహనం
16న గజ వాహనం
17న రథోత్సవం
18న ఉదయం బిక్షాండి, సాయంత్రం తిరుకల్యాణం..రాత్రి అశ్వవాహన సేవ,
19న ధ్వజ అవరోహణం, రాత్రి వడాయత్తు ఉత్సవం, స్వామికి ఏకాంత ఉత్సవంతో ఆలయంలో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి.
కాగా కరోనా నేపధ్యంలో బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నట్లు ఈ.వో. ఏ.వెంకటేశు తెలిపారు.

మంత్రికి స్వామివారి చిత్రపటాన్ని బహుకరిస్తున్న ఆలయ అధికారులు

ప్రత్యేక ఉత్సవాల్లో భాగంగా
20వ తేదీ సోమవారం అధికారనంది వాహనం
21న రావనబ్రహ్మ వాహనం
22న యాళీ వాహనం
23న సూర్యప్రభ వాహనం
24న చంద్రప్రభ వాహనం
25న పుష్పపల్లకి సేవ
26న కామధేను వాహనం
27న కల్ప వృక్ష వాహనం
28న విమానోత్సవం
29న పూలంగి సేవ
30వ తేదీ గురువారం తెప్పోత్సవంతో  ఆలయంలో నిర్వహించే ప్రత్యేక ఉత్సవాలు ముగుస్తాయని ఈవో ఒక ప్రకటనలో తెలిపారు.