అరుదైన రికార్డు: సచిన్ సరసన నిలిచిన ధోనీ

  • Publish Date - March 4, 2019 / 01:55 PM IST

భారత జట్టు మాజీ సారధి, వికెట్ కీపర్ మహేంద్ర సింగ్ ధోనీ.. అరుదైన రికార్డును నమోదు చేశాడు. హైదరాబాద్ లోని ఉప్పల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్‌లో అర్థశతకంతో విజయం దక్కేలా చేసిన ధోనీ.. లిస్ట్-ఏ మ్యాచుల్లో 13వేల పరుగులు చేసిన భారత జట్టు ఆటగాళ్ల సరసన చేరాడు. ఇప్పటివరకూ 412 లిస్ట్-ఏ మ్యాచులు ఆడిన ధోనీ 13,054 పరుగులు చేశాడు. దీంతో భారత జట్టు క్రికెట్ దిగ్గజాలైన సచిన్ టెండూల్కర్, మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రవిడ్ ల తర్వాత 13 వేల మైలురాయిని చేరుకున్న నాలుగవ భారత క్రికెటర్‌గా ధోనీ నిలిచాడు.
Also Read : రాజకీయాల్లోకి జూ.ఎన్టీఆర్ : టీడీపీ అధ్యక్షుడిగా బాధ్యతలు

హైదరాబాద్ వన్డేలో కేదార్ జాదవ్‌తో కలిసి 141 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నమోదు చేసిన ధోనీ 72 బంతుల్లో 59 పరుగులు చేసి వన్డే కెరీర్‌లో 71వ అర్థ శతకాన్ని నమోదు చేసుకున్నాడు. అంతేకాక వన్డేల్లో అత్యధిక సిక్సులు కొట్టిన భారత క్రికెటర్‌గా రోహిత్ రికార్డును ధోనీ తిరగరాశాడు. ఈ మ్యాచ్‌లో ఒకే ఒక సిక్సు కొట్టిన ధోనీ 215 సిక్సులతో మొదటిస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. 
Also Read : హైదరాబాద్ లో కాంబ్లె ముఠా : పురుషుల మెడలో గొలుసులే టార్గెట్