Madan Lal : ఐపీఎల్ 2025 టోర్నీలో పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్ తర్వాత లక్నో యజమాని సంజీవ్ గోయెంకా ఎల్ ఎస్ జీ కెప్టెన్ రిషబ్ పంత్ తో సీరియస్ గా మాట్లాడుతూ కనిపించారు. గతంలో లక్నో కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ తోనూ సంజీవ్ గోయెంకా ఇలానే మాట్లాడటం గుర్తుకు తెచ్చింది. అప్పుడు కూడా ఓటమి తర్వాత సంజీవ్ గోయెంకా చాలా సీరియస్ గా కేఎల్ రాహుల్ తో మాట్లాడటం జరిగింది. తాజాగా పంత్ కు వేలు చూపిస్తూ గోయెంకా మాట్లాడిన తీరు హాట్ టాపిక్ గా మారింది.
పంత్, గోయెంకా మధ్య సీరియస్ డిస్కషన్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పంత్ తో ఆయన ఇలా మాట్లాడటం ఇదే తొలిసారి కాదు. ఢిల్లీ క్యాపిటల్స్ తో ఓటమి తర్వాత కూడా ఇదే సీన్ కనిపించింది.
ఈ వ్యవహారంపై మాజీ క్రికెటర్, 1983 వరల్డ్ కప్ విన్నర్ టీమ్ సభ్యుడు మదన్ లాల్ స్పందించారు. ఆటగాళ్లను స్వేచ్చగా ఆడనివ్వాలని లక్నో యజమాని సంజీవ్ గోయెంకాకు ఆయన సూచించారు. వారిని ఒత్తిడికి గురి చేయడం కరెక్ట్ కాదన్నారు. ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడేందుకు వారికి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు మదన్ లాల్.
”రిషబ్ పంత్, సంజీవ్ గోయంకా మధ్య ఏం డిస్కషన్ జరిగిందో నాకు తెలీదు. ఆ అబ్బాయిని ఎంజాయ్ చేయనివ్వండి. అతడు స్వేచ్చగా ఆడే అవకాశం ఇవ్వండి. టీ20 క్రికెట్ లో ఎప్పుడేం జరుగుతుంతో ఎవరూ ఊహించలేరు” అని మదన్ లాల్ అన్నారు.
27 కోట్లు.. 17 పరుగులు.. పంత్ ఫ్లాప్ షో..
ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఖరీదైన ఆటగాడిగా పంత్ నిలిచాడు. 27 కోట్లకు లక్నో పంత్ ని దక్కించుకుంది. కానీ, పంత్ ప్రదర్శన చాలా పేలవంగా ఉంది. ఈ సీజన్ లో పంత్ ప్రదర్శన పట్ల ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను ఆడిన మూడు మ్యాచులలో పంత్ చేసింది 17 పరుగులే. ఢిల్లీ మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. హైదరాబాద్ తో మ్యాచ్ లో 15 పరుగులు చేయగా, పంజాబ్ తో జరిగిన పోరులో 2 పరుగులే చేశాడు. అటు కీపర్ గానూ, ఇటు కెప్టెన్ గానూ పంత్ ఆకట్టుకోవడం లేదని ఫ్యాన్స్ సీరియస్ అవుతున్నారు. పంత్ ఫ్లాష్ షో పై అటు ఫ్యాన్స్, ఇటు జట్టు ఓనర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
I don’t know the discussion between Rishab ad Mr Sanjiv’s Goenka . All this can happened inside.Let boys enjoy the game let them play freely.20/20 cricket very unpredictable.
— Madan Lal (@MadanLal1983) April 2, 2025