LSG vs PBKS : పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను కౌగలించుకున్న లక్నో యజమాని సంజీవ్ గొయెంకా.. ‘మా జట్టులోకి వస్తావా..?’
పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి తరువాత లక్నో యజయాని సంజీవ్ గొయెంకా చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు.

Lucknow Super Gaints owner having a chat with Shreyas Iyer after LSG vs PBKS match (Source:X)
కొత్త కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025 సీజన్‌లో అదరగొడుతోంది. ఈ సీజన్‌లో వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. మంగళవారం లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
ఈ సీజన్‌లో అయ్యర్ కెప్టెన్‌గానే కాకుండా బ్యాటర్‌గానూ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు. ఈ క్రమంలో లక్నో వర్సెస్ పంజాబ్ మ్యాచ్ అనంతరం లక్నో యజయాని సంజీవ్ గొయెంకా చేసిన పనికి అందరూ ఆశ్చర్యపోయారు.
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ 30 బంతుల్లో 44 పరుగులు, ఆయుష్ బదోని 33 బంతుల్లో 41 పరుగులు లు చేశారు. కెప్టెన్ రిషబ్ పంత్ (2), మిచెల్ మార్ష్ (0) లు ఘోరంగా విఫలం అయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ మూడు వికెట్లు తీశాడు. యాన్సెన్, చాహల్, మాక్స్‌వెల్, ఫెర్గూసన్‌లు తలా ఓ వికెట్ సాధించారు.
ఆ తరువాత ప్రభ్‌సిమ్రన్ సింగ్ (34 బంతుల్లో 69), శ్రేయస్ అయ్యర్ (30 బంతుల్లో 52 నాటౌట్), నేహాల్ వధేరా (25 బంతుల్లో 43 నాటౌట్) లు దంచికొట్టడంతో లక్ష్యాన్ని పంజాబ్ 16.2 ఓవర్లలో రెండు వికెట్లు నష్టపోయి ఛేదించింది.
అయ్యర్‌ను కౌగలించుకున్న సంజీవ్ గొయెంకా..
కాగా.. ఈ మ్యాచ్ పూర్తి అయిన తరువాత ఇరు జట్ల ఆటగాళ్లు ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఆ తరువాత మైదానంలోకి వచ్చిన లక్నో యజమాని సంజీవ్ గొయెంకా పంజాబ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్‌ను కౌగలించుకున్నాడు. ఆ తరువాత అతడితో చాలా సేపు మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Goenka saab to Shreyas Iyer #LSGvsPBKS pic.twitter.com/Z2Q4miFMeF
— विक्रम 𝘬ꪊꪑꪖ𝘳 🦇 (@printf_meme) April 1, 2025
వచ్చే సీజన్‌లో రూ.37 కోట్లు ఇస్తా.. పంజాబ్ ను వదిలి లక్నోకు వచ్చేయ్ అని సంజీవ్ గొయెంకా అయ్యర్‌తో అన్నట్లుగా నెటిజన్లు సరదాగా కామెంట్లు చేస్తున్నారు.
Sanjeev Goenka said to shreyas Iyer , we have 27 cr player but he is not able to perform, how can you do that ? 😡#Rishbahpant #ShreyasIyer pic.twitter.com/ihfkrFQCCe
— Cricket_In _blood (@HarshRa26520588) April 1, 2025