LSG vs PBKS : పంజాబ్ పై ఓటమి.. పంత్‌కు వేలు చూపిస్తూ లక్నో యజమాని సంజీవ్ గొయెంకా సీరియస్ డిస్కషన్..
పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమి తరువాత లక్నో యజయాని సంజీవ్ గొయెంకా కెప్టెన్ రిషబ్ పంత్‌తో సీరియస్‌గా మాట్లాడుతూ కనిపించాడు.

Sanjiv Goenka points finger at Rishabh Pant in intense chat after LSG vs PBKS match (Source:X)
ఐపీఎల్ 2025లో భాగంగా లక్నోలోని ఎకానా స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఈ సీజన్‌లో ఇప్పటి వరకు లక్నో మూడు మ్యాచ్‌లు ఆడగా.. ఇది రెండో ఓటమి కావడం గమనార్హం. ఈ మ్యాచ్‌లో లక్నో ఓడిపోయిన తరువాత అందరి దృష్టి ఒక్కరి పైనే పడింది.
అతడు మరెవరో కాదు లక్నో యజమాని సంజీవ్ గొయెంకా. ప్రతి ఒక్కరు ఊహించినట్లుగానే లక్నో మ్యాచ్ ఓడిపోగానే.. అతడు మైదానంలోకి వచ్చి వేలు చూపిస్తూ పంత్‌తో సీరియస్‌గా మాట్లాడాడు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ (44; 30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆయుష్ బదోని (41; 33 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) లు రాణించగా.. కెప్టెన్ రిషబ్ పంత్ (2), మిచెల్ మార్ష్ (0) లు ఘోరంగా విఫలం అయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ మూడు వికెట్లు తీశాడు. యాన్సెన్, చాహల్, మాక్స్‌వెల్, ఫెర్గూసన్‌లు తలా ఓ వికెట్ సాధించారు.
ఆ తరువాత ప్రభ్‌సిమ్రన్ సింగ్ (69; 34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (52 నాటౌట్; 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు), నేహాల్ వధేరా (43 నాటౌట్; 25 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) లు మెరుపులు మెరిపించడంతో లక్ష్యాన్ని పంజాబ్ 16.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది.
BCCI : కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్‌లకు శుభవార్త చెప్పనున్న బీసీసీఐ..
వేలు చూపిస్తూ..
పంజాబ్ చేతిలో మ్యాచ్ ఓడిపోగానే.. లక్నో యజమాని సంజీవ్ గొయెంకా మైదానంలోకి వచ్చాడు. రిషబ్ పంత్‌తో చాలా సీరియస్‌గా చర్చించాడు. వీరిద్దరి చర్చల మధ్యలో గొయెంకా కొన్ని సార్లు పంత్ వైపు వేలు చూపిస్తూ మాట్లాడాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Goenka be like: Gussa toh bahut aa rha h tujh pr, pr kya karu Public dkh rhi h !!#LSGvsPBKS #IPL2025 pic.twitter.com/Dmg25fmMdj
— Cricket Adda (@Aslicricketer23) April 1, 2025
జట్టు ఆటతీరు పట్ల గొయెంకా అసంతృప్తిగా ఉన్నాడని అంటున్నారు. రూ.27 కోట్లు పెట్టి కొన్న పంత్ ఇప్పటి వరకు కనీసం 27 పరుగులు కూడా చేయలేకపోవడంతో పంత్ పై సీరియస్ అయి ఉంటాడని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఏదీ ఏమైనప్పటికి కూడా పంత్ కి వేలు చూపిస్తూ మాట్లాడడం సరికాదని కొందరు నెటిజన్లు తప్పుబడుతున్నారు.