IPL 2025 : పంజాబ్ చేతిలో ఓటమి పై స్పందించిన లక్నో కెప్టెన్ రిషబ్ పంత్.. ఇంతకు మించి ఏమీ చెప్పలేను..
పంజాబ్ కింగ్స్ చేతిలో ఓటమిపై లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ స్పందించాడు.

pic credit@mufaddal_vohra
ఐపీఎల్ 2025 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ రెండో ఓటమిని నమోదు చేసింది. మంగళవారం లక్నోలోని ఎకానా స్టేడియంలో పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిది వికెట్ల తేడాతో ఓడిపోయింది. బ్యాటర్ల వైఫల్యం కారణంగా లక్నో ఈ మ్యాచ్‌లో ఓడిపోయిందని ఆ జట్టు కెప్టెన్ రిషబ్ పంత్ అంగీకరించాడు. ఈ పిచ్ పై 171 పరుగులను కాపాడుకోవడం చాలా కష్టమన్నాడు.
ఈ మ్యాచ్‌లో లక్నో తొలుత బ్యాటింగ్ చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో నికోలస్ పూరన్ (44; 30 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లు), ఆయుష్ బదోని (41; 33 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లు) లు రాణించారు. కెప్టెన్ రిషబ్ పంత్ (2), మిచెల్ మార్ష్ (0) లు విఫలం అయ్యారు. పంజాబ్ బౌలర్లలో అర్ష్ దీప్ సింగ్ మూడు వికెట్లు తీశాడు. యాన్సెన్, చాహల్, మాక్స్‌వెల్, ఫెర్గూసన్‌లు తలా ఓ వికెట్ సాధించారు.
అనంతరం లక్ష్యాన్ని పంజాబ్ 16.2 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. పంజాబ్ బ్యాటర్లలో ప్రభ్‌సిమ్రన్ సింగ్ (69; 34 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (52 నాటౌట్; 30 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు), నేహాల్ వధేరా (43 నాటౌట్; 25 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) లు దంచికొట్టారు.
కాగా.. మ్యాచ్ అనంతరం ఓటమిపై లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ స్పందించాడు. మ్యాచ్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోవడంతో భారీ స్కోరు నమోదు చేయలేకపోయినట్లు చెప్పుకొచ్చాడు. ఇంకో 20 నుంచి 25 పరుగులు చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డాడు. అయితే.. ఆటలో ఇలాంటివి సహజమని చెప్పాడు. ఎకానా స్టేడియం తమ హోండ్ గ్రౌండ్ అయినా కూడా ఇప్పటికి ఇక్కడి పరిస్థితులను అంచనా వేస్తూనే ఉన్నామన్నాడు.
BCCI : కోహ్లీ, రోహిత్ శర్మ, శ్రేయస్ అయ్యర్‌లకు శుభవార్త చెప్పనున్న బీసీసీఐ..
మ్యాచ్‌లో ప్రతి ఆటగాడు ముందుకు తీసుకువెళ్లడానికి తీవ్రంగా ప్రయత్నించారన్నాడు. స్లో వికెట్ అని భావించామని, బంతులు ఆగి వస్తాయని అనుకున్నట్లుగా చెప్పాడు. ఈ మ్యాచ్ నుంచి ఎన్నో విషయాలను నేర్చుకోని ముందుకు సాగాలన్నాడు. మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికి కొన్ని సానుకూలతలు ఉన్నాయని తెలిపాడు. ప్రస్తుతానికి ఇంతకు మించి ఏమీ చెప్పలేను అని పంత్ అన్నాడు.