India tour of Australia : తొలి సమరానికి భారత్, ఆసిస్ జట్లు రెడీ అయ్యాయి. 2020, నవంబర్ 27వ తేదీ శుక్రవారం ఉదయం 9గంటల 10నిమిషాలకు ఫస్ట్ ఫైట్ ప్రారంభం అయ్యింది. టాస్ గెలిచిన ఆసీస్ బ్యాటింగ్ ఎంచుకుంది. కరోనా కారణంగా ఐపీఎల్ టోర్నీ అభిమానులు లేకుండా జరిగింది. అయితే.. భారత్, ఆసిస్ ఫైట్‌కు మాత్రం క్రికెట్ ఫ్యాన్స్‌ను అనుమతిస్తున్నారు. సిడ్నీలో జరిగే తొలి వన్డేకు 50 శాతం మాత్రమే నిండేలా ప్రేక్షకులను అనుమతించారు.
9 నెలల తర్వాత ఆడనున్న తొలి అంతర్జాతీయ సిరీస్ కావడంతో టీమిండియా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. గత పర్యటనలో టెస్ట్ సిరీస్‌ను 2-1తో గెలిచి చరిత్ర సృష్టించిన కోహ్లి సేన.. ఈసారి కూడా అలాంటి అద్భుతం చేస్తుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. అయితే ఓపెనర్ రోహిత్ శర్మ గాయం కారణంగా వన్డే, టీ20 సిరీస్‌కు దూరమయ్యాడు.
రోహిత్ శర్మ లేకపోవడంతో శిఖర్ ధావన్‌తో కలిసి మయాంక్ అగర్వాల్ ఓపెనింగ్ చేసే అవకాశం ఉంది. మూడోస్థానంలో కోహ్లి, నాలుగో స్థానంలో శ్రేయస్ అయ్యర్, ఐదో స్థానంలో రాహుల్ బ్యాటింగ్‌కు దిగనున్నారు. ఈ సిరీస్‌లోనూ రాహులే వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించనున్నాడు. ఇక బుమ్రా, షమి ఇద్దరూ తుది జట్టులో ఉంటే.. ఠాకూర్, సైనీలలో ఒకరికి మాత్రమే అవకాశం దక్కుతుంది. అటు స్పిన్నర్లలో చాహల్ లేదా కుల్‌దీప్‌లలో ఒకరిని తీసుకోవాల్సి ఉంటుంది.
ఇండియా టీం : శిఖర్ ధావన్, మయాంక్ అగర్వాల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్, హార్థిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, యజువేంద్ర చాహల్, నవదీప్ సైనీ, మహ్మద్ షమి, బస్ప్రీత్ బుమ్రా.
ఆసీస్ టీం : డేవిడ్ వార్నర్, అరోన్ ఫించ్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, గ్లెన్ మాక్స్ వెల్, మార్నస్ లబుషేన్, మార్కస్ స్టాయినిస్, అలెక్స్ క్యారీ, పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, జోష్ హాజిల్ వుడ్, ఆడం జంపా.