2023 Ioc Session
2023 IOC Session :దశాబ్దాల నాటి కల నెరవేరబోతుందంటూ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సభ్యురాలైన నీతా అంబానీ సంతోషం వ్యక్తం చేశారు. ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ తర్వాతి సదస్సు 2023లో జరగనుండగా ఈ కార్యక్రమానికి ముంబై వేదికగా కానుంది. ఐఓసీ సెషన్ 2022లో జరిగిన ఓటింగ్ కార్యక్రమంలో ద సిటీ ఆఫ్ డ్రీమ్స్ ముంబై పేరును అధికారికంగా ప్రకటించారు.
మొత్తం 82మంది ఐఓసీ సభ్యులు పాల్గొన్న ఓటింగ్ లో ఆరుగురు మాత్రమే ముంబైయేతర ప్రాంతానికి ఓటేయగా 75మంది సభ్యులు ఆమోదం తెలిపారు. ఒక్క ఓటు మాత్రమే ముంబైలో ఐఓసీ సెషన్ జరగొద్దంటూ పోల్ అయింది.
ఇండియన్ ఒలింపిక్ కమిటీ సభ్యుల జనరల్ మీటింగ్ నే ఐఓసీ సెషన్ అని చెబుతారు. ఐఓసీ నిర్ణయమే తుది నిర్ణయం కాగా ఓటింగ్ తర్వాత జియో వరల్డ్ సెంటర్ వేదికగా 2023 ఎడిషన్ నిర్వహించాలని ప్లాన్ చేస్తున్నారు.
Read Also: డికాక్ ఇంటర్వ్యూ మధ్యలో నీతా అంబానీ వచ్చి ఏం చేసిందో తెలుసా
ఈ సందర్భంగా మాట్లాడిన నీతా అంబానీ.. ‘ప్రతిష్టాత్మకమైన ఒలింపిక్ ఈవెంట్‌కు ఆతిథ్యం ఇవ్వనున్నాం. ఆ భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహించడం గౌరవంగా భావిస్తున్నాను. ఒలింపిక్ మూమెంట్ లో ఇండియా ఏదో ఒక ప్రత్యేకమైనదాన్ని సృష్టించగలదని నిజంగా నమ్ముతున్నా. ‘ అని ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సభ్యురాలైన నీతా అంబానీ అన్నారు.
ఈ అనౌన్స్‌మెంట్ తర్వాత మహారాష్ట్ర సీఎం ఉద్దవ్ ఠాకరే ట్విట్టర్ వేదికగా ఇది సాధించడానికి నీతా అంబానీ చేసిన కృషిని అభినందించారు.
‘ముంబై 2023 ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ సెషన్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇది గొప్పదనం మాత్రమే కాదు. భారతదేశాన్ని క్రీడల్లో మరింత ముందుకు తీసుకెళ్లడానికి ఒక అవకాశం కూడా. శ్రీమతి నీతా అంబానీ గారూ చేసిన కృషి ఫలితంగానే 2023 సెషన్ ముంబైలో జరుగుతుంది’ అని పోస్టు పెట్టారు.
Read Also: మోస్ట్ పవర్‌ఫుల్ ఉమెన్‌గా నీతా అంబానీ
2023 ఐఓసీ సెషన్ లో వచ్చే ఏడాది మే లేదా జూన్ లో జరిగే 2030 వింటర్ ఒలింపిక్స్ వేదికను నిర్ణయిస్తారు.
ఇండియా చివరిసారిగా 1983లో జరిగిన ఇంటర్నేషనల్ ఒలింపిక్ సెషన్ కు ఆతిథ్యం ఇచ్చింది.