మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కించుకోవడమంటే మ్యాచ్ మొత్తం క్రీజులో ఉండి జట్టును గెలిపించడం కాదు. ఉన్నంతసేపు గెలిచేలా ఆడటం. అది చివర్లో అయినా.. మధ్యలో అయినా.. ప్రతి క్రికెటర్ కల జట్టును గెలిపించాలనే. అలా చేస్తే ర్యాంకు మెరుగుపడటంతో పాటు బెంచ్ కు పరిమితమయ్యే అవకాశాల నుంచి బయటపడేస్తుంది.
కానీ, మనం మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అంటే ఓ 5వికెట్లు పడగొట్టడమో.. సెంచరీలు బాదేయడం మాత్రమే అనుకుంటాం. అలా కాకుండా కేవలం 12 బాల్స్ అంతకంటే తక్కువ ఆడి మ్యాన్ ఆఫ్ దమ్యాచ్ గెలుచుకున్న సందర్భాలు ఉన్నాయి. చివర్లో మెరుపులు కురిపించి మ్యాచ్ విజయానికి కారణమైన ఓ ఐదుగురు గురించి చర్చించుకుందాం.
5. మొయిన్ అలీ
ఇంగ్లాండ్ క్రికెటర్ మొయిన్ అలీ 2020 ఫిబ్రవరిలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో 11 బంతుల్లో 39పరుగులు చేశాడు. ఈ సూపర్ హిట్ ఇన్నింగ్స్ లో 4సిక్సులు, 3ఫోర్లు చేసి 36పరుగులు సంపాదించాడు. అద్భుతమైన ఫినిషింగ్ ఇచ్చి ఇంగ్లాండ్ జట్టులో హై స్కోరర్ కావడమే కాకుండా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు.
4. జోస్ బట్లర్
అగ్రెసివ్ ప్లేయర్ జోస్ బట్లర్.. బౌలర్ ఎవరైనా సరే ప్రతి బాల్ బౌండరీకి పంపాలనే హిట్టింగ్ చేస్తాడు. ఫస్ట్ టీం గురించి తర్వాత కెరీర్ మైలు రాళ్ల గురించి ఆలోచిస్తాడు. కేవలం 10బంతుల్లో 32 పరుగులు చేసి కెరీర్లోనే బెస్ట్ మ్యాచ్ ఆడాడు. 2012లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 2ఫోర్లు, 2సిక్సులు సాధించి జట్టును గెలిపించాడు. ఆ తర్వాత అతణ్ని మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు వరించింది.
3. దినేశ్ కార్తీక్
ఓ ఇండియా క్రికెట్ అభిమానిగా 2018 నిదహాస్ ట్రోఫీ గురించి ఎవరూ మర్చిపోరు. బంగ్లాదేశ్ కు పూర్తిగా అనుకూలంగా ఉన్న మ్యాచ్ ను టీమిండియా వైపుకు తిప్పేశాడు. 8బంతుల్లో 29పరుగులు చేసి మైండ్ బ్లోయింగ్ పర్ ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ విజయవంతమైన ఇన్నింగ్స్ కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వరించింది.
2. బ్రాడ్ హడ్గే
ఆస్ట్రేలియా మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ బ్రాడ్ హడ్గే హార్డ్ హిట్టింగ్ స్కిల్స్‌తో దక్షిణాఫ్రికాతో జరిగిన టీ20 మ్యాచ్ ను జట్టు వైపుకు తిప్పేశాడు. వర్షం గేమ్‌కు ఆటంకం కలిగించడంతో 7ఓవర్లకు కుదించారు. లాస్ట్ ఓవర్ లో ఆస్ట్రేలియా జట్టుకు 15పరుగులు కావాల్సి ఉంది. ఆ సమయంలో హడ్గే మ్యాజికల్ పర్‌ఫార్మెన్స్ ఇచ్చి జట్టును గెలిపించాడు. ఓవర్లో రెండు బంతులు మిగిలి ఉండగానే రెండు సిక్సులు బాది మ్యాచ్ ముగించాడు. 8బంతుల్లో 21పరుగులు చేశాడు.
1. రామ్ నరేశ్ శర్వాన్
ఐసీసీ క్రికెట్ టీ20 వరల్డ్ కప్ 2009లో భాగంగా ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ క్రికెటర్ రామ్ నరేశ్ శర్వాన్ 9 బంతుల్లో 19పరుగులు చేశాడు. వర్షం మ్యాచ్ ను ఆపేయడంతో డక్‌వర్త్ లూయీస్ పద్ధతి ప్రకారం.. శర్వాన్ ప్రదర్శన మ్యాచ్ గెలవడానికి కారణమయ్యాడు.
Read: ఒకేరోజు స్టార్ క్రికెటర్ సహా ముగ్గురికి కరోనా, ఆందోళనలో అభిమానులు