Mohammad Shami: భయ్యా నెమ్మదిగా వెళ్లండి.. క్రికెటర్ షమీకి అభిమానుల సూచన.. ఎందుకంటే?

మహ్మద్ షమీ తన ఎరుపు రంగు జాగ్వార్ కారుతో ఫొటోను తన అధికారిక ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. దీనికి క్యాప్షన్ గా ‘కొన్ని ప్రయాణాలకు రోడ్లు అవసరం లేదు. హృదయపూర్వక హృదయాలు మాత్రమే ఉంటాయి.’ అంటూ పేర్కొన్నాడు. మహ్మద్ షమీ గతేడాది జూలైలోని జాగ్వార్ ఎఫ్ -టైప్ స్పోర్ట్స్ కారును కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఆ కారు ఫొటోతో ట్వీట్ చేయడంతో ...

Mohammad Shami

Mohammad Shami: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీకి అభిమానులు పలు సూచనలు చేశారు. భయ్యా నెమ్మదిగా వెళ్లండి.. అంటూ సూచించారు. ఇటీవల టీమిండియా ప్లేయర్ రిషబ్ పంత్ కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. తీవ్రగాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం పంత్ పరిస్థితి మెరుగ్గానే ఉన్పప్పటికీ తిరిగి క్రికెట్‌లో పునరాగమనం చేయాలంటే కొంత సమయం పడుతుంది. ఇదే సమయంలో తనకున్న కోటి రూపాయల కారుతో షమీ ఆసక్తికర ట్వీట్ చేశారు.

Shami vs Akhtar: పాక్ ఓటమిపై అఖ్తర్ బాధాకరమైన పోస్ట్.. ఆసక్తికర కౌంటర్ ఇచ్చిన షమీ

మహ్మద్ షమీ తన ఎరుపు రంగు జాగ్వార్ కారుతో ఫొటోను తన అధికారిక ట్విటర్ ఖాతాలో పంచుకున్నారు. దీనికి క్యాప్షన్ గా ‘కొన్ని ప్రయాణాలకు రోడ్లు అవసరం లేదు. హృదయపూర్వక హృదయాలు మాత్రమే ఉంటాయి.’ అంటూ పేర్కొన్నాడు. మహ్మద్ షమీ గతేడాది జూలైలోని జాగ్వార్ ఎఫ్ -టైప్ స్పోర్ట్స్ కారును కొనుగోలు చేశాడు. ప్రస్తుతం ఆ కారు ఫొటోతో ట్వీట్ చేయడంతో అభిమానులు షమీకి జాగ్రత్తలు చెబుతూ రీ ట్వీట్లు చేస్తున్నారు.

 

భయ్యా నెమ్మదిగా  డ్రైవ్ చేయండి ప్లీజ్ అంటూ కొందరు నెటిజన్లు పేర్కొన్నగా.. ఇది చాలా ఫాస్ట్ కారు, బీకేర్ ఫుల్ బ్రదర్ అని మరికొందరు నెటిజన్లు పేర్కొన్నారు. ఫాస్ట్ డ్రైవ్ చేయొద్దని మహ్మద్ షమీకి అధికశాతం మంది అభిమానులు సూచనలు చేస్తూ సలహా ఇస్తున్నారు. అలాగే వన్డే జట్టులోకి తన పునరాగమనంపై శుభాకాంక్షలు తెలిపారు. జనవరి 10 నుంచి శ్రీలంకతో టీమిండియా మూడు వన్డే మ్యాచ్‌లు ఆడుతుంది. రేపు గౌహతిలో జరిగే వన్డే మ్యాచ్ లో షమీకూడా ఆడనున్నారు. గాయం కారణంగా కొంతకాలం క్రికెట్ కు దూరంగా ఉన్న షమీ రేపటి మ్యాచ్ తో పునరాగమనం చేయనున్నారు.