Shami vs Akhtar: పాక్ ఓటమిపై అఖ్తర్ బాధాకరమైన పోస్ట్.. ఆసక్తికర కౌంటర్ ఇచ్చిన షమీ

వాస్తవానికి గ్రూప్ దశలోనే పాకిస్తాన్ ఇంటి దారి పడుతుందని అనుకున్నప్పటికీ అదృష్టం కలిసొచ్చి ఫైనల్ వరకు వెళ్లింది. నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడటం పాక్‭కు లక్కుగా మారింది. ఇక సెమీ ఫైనల్ మ్యాచులో న్యూజీలాండ్‭పై విజయంతో ఎట్టకేలకు ఫైనల్ చేరుకుంది. కానీ, ఇంగ్లాండ్ ముందు తల వంచక తప్పలేదు. ఐదు వికెట్ల తేడాతో టీ-20 ప్రపంచ కప్‭ను ఇంగ్లాండ్‭కు వదులుకుంది పాకిస్తాన్.

Shami vs Akhtar: పాక్ ఓటమిపై అఖ్తర్ బాధాకరమైన పోస్ట్.. ఆసక్తికర కౌంటర్ ఇచ్చిన షమీ

Mohammad Shami faces backlash for ‘karma tweet to Shoaib Akhtar

Updated On : November 13, 2022 / 9:29 PM IST

Shami vs Akhtar: టీ-20 ప్రపంచ కప్‭లో ఇంగ్లాండ్ చేతిలో పాక్ ఘోర పరాభవం తిని ట్రోఫిని కోల్పోయింది. సెమీస్‭లో బాగా రాణించి ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకున్న పాకిస్తాన్.. ఇంగ్లాండ్ జట్టు ముందు నిలవలేక ఓటమిని అంగీకరించింది. అయితే ఈ ఓటమిపై పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షోయబ్ అఖ్తర్ ఒక బాధాకరమైన ట్వీట్ చేశారు. బ్రొకెన్ హాట్ ఎమోజీని ట్వీట్ చేస్తూ.. పాక్ ఓటమితో గుండె బద్దలైందనట్లుగా తన బాధను వ్యక్తం చేశారు. కాగా, అఖ్తర్ రియాక్షన్‭కు భారత బౌలర్ మహ్మద్ షమీ ఆసక్తికర కౌంటర్ ఇచ్చారు.

అఖ్తర్ ట్వీట్‭ను షమీ షేర్ చేస్తూ ‘సారీ బ్రదర్.. దీన్నే కర్మ అంటారు’ అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. షమీ ట్వీట్‭కు ఇంత పెద్ద స్థాయిలో ఆదరణ రావడానికి పాకిస్తానే కారణం. సెమీ ఫైనల్‭లో ఇంగ్లాండ్ చేతిలో భారత్ పరాభవం అనంతరం పాక్ ఆటగాళ్లు హేళన చేశారు. ‘పాకిస్తాన్‭తో తలపడే అవకాశం ఇండియాకు లేకనే సెమీసులో ఓండింది’ అంటూ వ్యాఖ్యానించారు. దానికి బదులే ప్రస్తుతం షమీ ట్వీట్.

వాస్తవానికి గ్రూప్ దశలోనే పాకిస్తాన్ ఇంటి దారి పడుతుందని అనుకున్నప్పటికీ అదృష్టం కలిసొచ్చి ఫైనల్ వరకు వెళ్లింది. నెదర్లాండ్స్ చేతిలో దక్షిణాఫ్రికా ఓడటం పాక్‭కు లక్కుగా మారింది. ఇక సెమీ ఫైనల్ మ్యాచులో న్యూజీలాండ్‭పై విజయంతో ఎట్టకేలకు ఫైనల్ చేరుకుంది. కానీ, ఇంగ్లాండ్ ముందు తల వంచక తప్పలేదు. ఐదు వికెట్ల తేడాతో టీ-20 ప్రపంచ కప్‭ను ఇంగ్లాండ్‭కు వదులుకుంది పాకిస్తాన్.

Delhi Liquor Scam: సోమవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కాంకి సంబంధించి కీలక విచారణ