Delhi Liquor Scam: సోమవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కాంకి సంబంధించి కీలక విచారణ

తనపై ఎవరి వత్తిడి లేదని కేసు దర్యాప్తు కు పూర్తిగా సహకరిస్తానని అప్రూవర్‭గా మారేందుకు అవకాశం ఇవ్వాలని నవంబర్ 9న సీబీఐ కోర్టు ముందు నిందితుడు దినేష్ అరోరా విన్నవించుకున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితులు అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్‭పై సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు ఇవ్వనుంది

Delhi Liquor Scam: సోమవారం సీబీఐ ప్రత్యేక కోర్టులో ఢిల్లీ లిక్కర్ స్కాంకి సంబంధించి కీలక విచారణ

Delhi liquor scam Highlights

Delhi Liquor Scam: ఢిల్లీ లిక్కర్ స్కాంకి సంబంధించి రేపు ఢిల్లీలోని సీబీఐ ప్రత్యేక కోర్టులో కీకల విచారణ జరగనుంది. రేపు ఉదయం 10:30 గంటలకి అప్రూవర్‭గా మారిన దినేష్ అరోరా వాంగ్మూలాన్ని కెమెరా ప్రొసీడింగ్స్ ద్వారా సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ఎంకే నాగ్ పాల్ రికార్డు చేయనున్నారు. ఇప్పటికే దినేష్ అరోరా తరపున రౌస్ అవెన్యూ కోర్టు వాదనలు విన్నది. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో దినేష్ అరోరాను సాక్షిగా పరిగణించాలంటూ కోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది.

తనపై ఎవరి వత్తిడి లేదని కేసు దర్యాప్తు కు పూర్తిగా సహకరిస్తానని అప్రూవర్‭గా మారేందుకు అవకాశం ఇవ్వాలని నవంబర్ 9న సీబీఐ కోర్టు ముందు నిందితుడు దినేష్ అరోరా విన్నవించుకున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఢిల్లీ లిక్కర్ స్కాం నిందితులు అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్ బెయిల్ పిటిషన్‭పై సీబీఐ ప్రత్యేక కోర్టు ఉత్తర్వులు ఇవ్వనుంది. దినేష్ అరోరా స్టేట్‭మెంట్ ఆధారంగా అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్‭ల బెయిల్‭పై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

అయితే వారిద్దరికీ బెయిల్ ఇవ్వొద్దని కోర్టుకి సీబీఐ ఇప్పటికే విన్నవించుకుంది. వారికి బెయిల్ ఇస్తే విచారణకు ఇబ్బంది కలుగుతుందని సీబీఐ కోర్టుకు తెలిపింది. అలాగే దినేష్ అరోరా స్టేట్మెంట్ ఇచ్చే సమయంలో బెయిల్ వద్దని కూడా సీబీఐ కోరింది. ఢిల్లీ లిక్కర్ పాలసీ రూపకల్పన సమావేశాల్లో విజయ్ నాయర్ కిలకపాత్ర పోషించారని, మంత్రుల వద్ద సమాచారం తీసుకుని వ్యాపారస్తులకు ఇచ్చారని,హవాలా మార్గాల్లో డబ్బులు ఇచ్చారని హైదరాబాద్, ఢిల్లీ, ముంబైలో హవాలా రూపంలో నగదు బదిలీలు చేశారని సీబీఐ ఆరోపిస్తోంది. ఎల్ 1 లైసెన్స్ దారులకు వచ్చే 12 శాతం కమిషన్‭లో 6 శాతం కమిషన్ తీసుకునేలా ఒప్పందాలు జరిగాయని సిబీఐ వాదిస్తోంది. లిక్కర్ స్కాంలో అధికార పార్టీ హస్తం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో విచారణ జరుపుమని సీబీఐ అంటోంది.

విజయ్ నాయర్ తరపు న్యాయవాది రెబెకా జాన్ స్పందిస్తూ ఢిల్లీ లిక్కర్ స్కాం లో 47 రోజులుగా పైగా సంబందం లేని వ్యక్తిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు కానీ ఎక్సైజ్ శాఖ అధికారులు మంత్రులను ప్రశ్నించలేదని, విజయ్ నాయర్ దర్యాప్తు‭కు సహకరిస్తున్నారని ఆగస్టు 19న ,సెప్టెంబర్ 6 న రెండుసార్లు విజయ్ నాయర్ నివాసంలో సోదాలు జరిగినప్పటికీ ఏమీ దొరకలేదని, దర్యాప్తుకు సహకరించడం లేదని అరెస్ట్ చేయడంలో అర్థం లేదని, ముడుపులు తీసుకున్నట్లు ఎక్కడా ఆధారాలు లేవని, విజయ్ నాయర్‭కు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు.

ఇక, అభిషేక్ బోయినపల్లి తరఫు న్యాయవాది శ్రీ సింగ్ స్పందిస్తూ అభిషేక్‌పై కేవలం నగదు లావాదేవీల ఆరోపణలు మాత్రమే ఉన్నాయని, అంతకు మించి ఎలాంటి ఆధారాలు సీబీఐకి దొరకలేదని, నెల రోజుల నుంచి అభిషేక్ రిమాండ్‌లో ఉన్నారని అభిషేక్ కు బెయిల్ మంజూరు చేయాలని వాదనలు వినిపించారు.

Rajiv Gandhi Assassination: రాజీవ్ హత్య గురించి అడిగి ప్రియాంక బోరున విలపించారు.. నళిని శ్రీహరన్