ACC U19 Asia Cup 2024 India won by 10 Wickets against UAE and Enter Semi Finals
షార్జా వేదికగా జరుగుతున్న అండర్-19 ఆసియా కప్‌లో భారత్ అదరగొడుతోంది. వరుస విజయాలతో సెమీ ఫైనల్‌కు దూసుకువెళ్లింది. బుధవారం జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో యూఏఈ పై భారత్ 10 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 138 పరుగుల లక్ష్యాన్ని 16.1 ఓవర్లలోనే భారత్ అందుకుంది.
టీమ్ఇండియా బ్యాటర్లలో 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. 46 బంతులు ఎదుర్కొన్న అతడు 3 ఫోర్లు, 6 సిక్సర్లు బాది 76 పరుగులతో అజేయంగా నిలిచాడు. అతడితో పాటు మరో ఓపెనర్ ఆయుష్ మాత్రే (67 నాటౌట్; 51 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లు) హాఫ్ సెంచరీతో రాణించాడు.
IND vs AUS : ఆసీస్‌తో రెండో టెస్టు.. టీమ్ఇండియా ప్లాన్‌ను లీక్ చేసిన కేఎల్ రాహుల్..!
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన యూఏఈ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. భారత బౌలర్ల ధాటికి 44 ఓవర్లలో 137 పరుగులకు కుప్పకూలింది. యూఏఈ బ్యాటర్లలో రాయన్ ఖాన్ (35; 48 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) టాప్ స్కోరర్.
అక్షత్ రాయ్ (26), ఏతాన్ డిసౌజా (17), ఉద్దీష్ (16) లు మాత్రమే రెండు అంకెల స్కోరు చేయగా మిగిలిన అందరూ సింగిల్ డిజిట్‌కే పరిమితం అయ్యారు. భారత బౌలర్లలోయుదాజిత్ గుహా మూడు వికెట్లు తీశాడు. చేతన్ శర్మ, హార్దిక్ రాజ్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఆయుష్ మాత్రమే ఓ వికెట్ సాధించాడు.
1️⃣3️⃣-year old on a rampage 😎
Vaibhav Suryavanshi is setting the field on 🔥 at Sharjah in #UAEvIND 💪
Cheer for #TeamIndia in the #ACCMensU19AsiaCup, LIVE NOW on #SonyLIV 📲 pic.twitter.com/HSz8aiTUiW
— Sony LIV (@SonyLIV) December 4, 2024