IND vs AUS : భారత బ్యాటర్ల కోసం ఆసీస్ మాస్టర్ ప్లాన్.. పిచ్ పై 6 మిల్లీమీటర్ల గడ్డి.. బుమ్రాను మరిచిపోయారా ఏంటి ?
కాగా.. 2020లో ఇదే మైదానంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 36 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.

Six millimeter grass on Adelaide pitch said pitch chief curator Damian Hough
IND vs AUS : బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భారత్ శుభారంభం చేసింది. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్‌లో 295 పరుగుల భారీ తేడాతో విజయాన్ని సాధించింది. ఈ క్రమంలో డిసెంబర్ 6 నుంచి అడిలైడ్ వేదికగా జరగనున్న రెండో టెస్టు మ్యాచ్‌లో ఎలాగైనా విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేయాలని ఆస్ట్రేలియా జట్టు పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో పిచ్ ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా.. 2020లో ఇదే మైదానంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 36 పరుగులకే ఆలౌటైన సంగతి తెలిసిందే.
ఈ డే అండ్ నైట్ టెస్టు కోసం పచ్చికతో కూడిన పిచ్‌ను రూపొందిస్తున్నారు. సుమారు ఆరు మిల్లీమీటర్ల గడ్డిని ఉంచనున్నట్లు హెడ్ క్యూరేటర్ డామియన్ హగ్ చెప్పాడు. దీంతో ఫ్లడ్ లైట్ల కింద కొత్త బంతితో బ్యాటింగ్ చేయడం చాలా కష్టంగా మారుతుందన్నాడు.
Prithvi Shaw : ఇది కదరా పృథ్వీ షా అంటే.. మూడు బంతుల్లో.. మారేదే లే..!
పిచ్ పై పచ్చిక ఎక్కువగా ఉండడంతో తేమశాతం అధికంగా ఉంటుందన్నాడు. మ్యాచ్ జరుగుతున్నా కొద్ది స్పిన్నర్లకు కూడా సహకారం అందవచ్చునని తెలిపాడు.
కాగా.. ప్రస్తుతం పిచ్ పై ఏడు మిల్లీమీటర్ల గడ్డి ఉందని, మ్యాచ్ సమయానికి దాన్ని ఆరు మిల్లీమీటర్లకు తగ్గిస్తామని చెప్పాడు. బ్యాట్‌కు, బంతికి మధ్య మంచి పోటీ ఉంటుందన్నాడు. రెండు జట్లకు అద్భుతమైన పేసర్లు ఉన్నారని, బాల్ పాతది అయ్యే కొద్ది బ్యాటర్లు పరుగుల వరద పారిస్తారని భావిస్తున్నట్లు చెప్పుకొచ్చాడు.
IND vs AUS : ఆస్ట్రేలియాతో రెండో టెస్టు.. కోహ్లీ, ద్రవిడ్ రికార్డులపై యశస్వి జైస్వాల్ కన్ను..
వ్యక్తి గత కారణాలతో తొలి టెస్టుకు దూరంగా ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ వచ్చేశాడు. అతడితో పాటు గాయంతో దూరం అయిన గిల్ సైతం రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. దీంతో తొలి టెస్టులో ఆడిన దేవ్‌దత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్‌ల స్థానంలో వీరిద్దరు తుది జట్టులోకి రావడం ఖాయం. అదే సమయంలో మొదటి టెస్టులో ఓపెనర్‌గా వచ్చిన కేఎల్ రాహుల్ మిడిల్ ఆర్డర్‌లో బ్యాటింగ్ చేయనున్నాడు.