IND vs AUS : ఆస్ట్రేలియాతో రెండో టెస్టు.. కోహ్లీ, ద్రవిడ్ రికార్డులపై యశస్వి జైస్వాల్ కన్ను..
టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్నాడు

Jaiswal looking to go past Kohli and Dravid record in IND vs AUS 2nd Test
టీమ్ఇండియా యువ ఆటగాడు యశస్వి జైస్వాల్ ప్రస్తుతం భీకర ఫామ్‌లో ఉన్నాడు. స్వదేశం, విదేశం అన్న తేడా లేకుండా పరుగుల వరద పారిస్తున్నాడు. ఈ ఏడాది టెస్టుల్లో వెయ్యికి పైగా పరుగులు చేశాడు. ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ 2023-2025లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కొనసాగుతున్నాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో 161 పరుగుతో చెలరేగాడు.
అడిలైడ్ వేదికగా భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య డిసెంబర్ 6 నుంచి రెండో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ క్రమంలో యశస్వి పలు రికార్డులపై కన్నేశాడు. రెండో టెస్టులో అతడు 78 పరుగులు చేస్తే ఓ క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు సాధించిన భారత ఆటగాళ్ల జాబితాలో కోహ్లీ, రాహుల్ ద్రవిడ్ రికార్డును బ్రేక్ చేస్తాడు. జైస్వాల్ 12 మ్యాచుల్లో 1280 పరుగులు చేశాడు. ద్రవిడ్ 16 మ్యాచుల్లో 1357 పరుగులు చేయగా, కోహ్లీ 13 మ్యాచుల్లో 1322 పరుగులు సాధించాడు. ఇక ఈ జాబితాలో 1562 పరుగులతో సచిన్ అగ్రస్థానంలో ఉన్నాడు.
అడిలైడ్ టెస్టుతో కలిపితే ఈ ఏడాది జైస్వాల్ మరో మూడు టెస్టులు ఆడే అవకాశం ఉంది. ఈ క్రమంలో అతడు మరో 282 పరుగులు చేస్తే సచిన్ రికార్డును అధిగమించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
ఓ క్యాలెండర్ ఇయర్‌లో టెస్టుల్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు..
సచిన్ టెండూల్కర్ – 2010లో 14 మ్యాచుల్లో 1562 పరుగులు
వీరేంద్ర సెహ్వాగ్ – 2008లో 14 మ్యాచుల్లో 1462 పరుగులు
సునీల్ గవాస్కర్ – 1979లో 17 మ్యాచుల్లో 1407 పరుగులు
MS Dhoni : జానపద గీతానికి ధోని డ్యాన్స్.. వీడియో వైరల్
గుండప్ప విశ్వనాథ్ – 1979లో 17 మ్యాచుల్లో 1388 పరుగులు
రాహుల్ ద్రవిడ్ – 2002లో 16 మ్యాచుల్లో 1357 పరుగులు
విరాట్ కోహ్లీ – 2018లో 13 మ్యాచుల్లో 1322 పరుగులు
యశస్వి జైస్వాల్ -2024లో 12 మ్యాచుల్లో 1280 పరుగులు