IND vs AUS : ఆస్ట్రేలియాతో రెండో టెస్టు.. కోహ్లీ ఒక్క శ‌త‌కం చేస్తే.. అటు స‌చిన్‌, ఇటు బ్రాడ్ మ‌న్ రెండు రికార్డులు బ్రేక్‌

ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ ఫామ్ అందుకున్నాడు.

IND vs AUS : ఆస్ట్రేలియాతో రెండో టెస్టు.. కోహ్లీ ఒక్క శ‌త‌కం చేస్తే.. అటు స‌చిన్‌, ఇటు బ్రాడ్ మ‌న్ రెండు రికార్డులు బ్రేక్‌

Virat Kohli eye Don Bradman and Sachin Tendulkar historic test records

Updated On : December 3, 2024 / 3:02 PM IST

ఆస్ట్రేలియా ప‌ర్య‌ట‌న‌లో టీమ్ఇండియా స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీ ఫామ్ అందుకున్నాడు. పెర్త్ వేదిక‌గా ఆస్ట్రేలియాతో జ‌రిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భార‌త్ 295 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఈ మ్యాచ్ భార‌త్ గెల‌వ‌డంలో కోహ్లీ త‌న వంతు పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో అజేయ శ‌త‌కం బాదాడు.

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా భార‌త జ‌ట్టు ఆస్ట్రేలియాతో మ‌రో నాలుగు టెస్టు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ నాలుగు మ్యాచుల్లో కోహ్లీ క‌నీసం ఒక్క సెంచ‌రీ చేసిన ప‌లు రికార్డుల‌ను అందుకుంటాడు. బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో అత్య‌ధిక శ‌త‌కాలు బాదిన ప్లేయ‌ర్‌గా రికార్డుల‌కు ఎక్కుతాడు. ప్ర‌స్తుతం ఈ రికార్డు స‌చిన్ టెండూల్క‌ర్‌, విరాట్ కోహ్లీ పేరిట సంయుక్తంగా ఉంది. వీరిద్ద‌రు చెరో తొమ్మిది సెంచ‌రీలు బాదాడు. స‌చిన్ 65 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘ‌న‌త అందుకుంటే కోహ్లీ 44 ఇన్నింగ్స్‌ల్లోనే దీన్ని అందుకున్నాడు.

MS Dhoni : జాన‌ప‌ద గీతానికి ధోని డ్యాన్స్‌.. వీడియో వైర‌ల్‌

బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ఆట‌గాళ్లు..
స‌చిన్ టెండూల్క‌ర్ – 65 ఇన్నింగ్స్‌ల్లో 9 సెంచ‌రీలు
విరాట్ కోహ్లీ – 44 ఇన్నింగ్స్‌ల్లో 9 శ‌త‌కాలు
రికీ పాంటింగ్ – 51 ఇన్నింగ్స్‌ల్లో 8 సెంచ‌రీలు
స్టీవ్ స్మిత్ – 37 ఇన్నింగ్స్‌ల్లో 8 శ‌త‌కాలు
మైకేల్ కార్క్ – 40 ఇన్నింగ్స్‌ల్లో 7 శ‌త‌కాలు

76 ఏళ్ల బ్రాడ్‌మ‌న్ రికార్డు..
నాలుగు మ్యాచుల్లో కోహ్లీ ఒక్క సెంచ‌రీ చేసినా డ్రాన్ బ్రాడ్‌మ‌న్ రికార్డు కూడా బ‌ద్ద‌లు కొడ‌తాడు. ఓ జ‌ట్టుపై అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ప‌ర్యాట‌క బ్యాట‌ర్‌గా విరాట్ రికార్డుల‌కు ఎక్కుతాడు. ప్ర‌స్తుతం ఈ రికార్డు బ్రాడ్‌మ‌న్ పేరిట ఉంది. ఇంగ్లాండ్ పై బ్రాడ్ మ‌న్ 11 శ‌త‌కాలు బాదాడు. కాగా.. కోహ్లీ ఆస్ట్రేలియాపై 10 సెంచ‌రీలు చేశాడు.

IND vs AUS : రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్‌.. గాయ‌ప‌డిన స్టీవ్‌స్మిత్‌, ల‌బుషేన్‌.. రెండో టెస్టుకు దూరం..!

ఓ జ‌ట్టు పై అత్య‌ధిక సెంచ‌రీలు చేసిన ప‌ర్యాట‌క బ్యాట‌ర్లు వీరే..
డాన్ బ్రాడ్‌మ‌న్ (ఆస్ట్రేలియా) – ఇంగ్లాండ్ పై 19 టెస్టుల్లో 11 సెంచ‌రీలు
విరాట్ కోహ్లీ (భార‌త్‌) – ఆస్ట్రేలియాపై 43 టెస్టుల్లో 10 సెంచ‌రీలు
జేబీ హాబ్స్ (ఇంగ్లాండ్‌) – ఆస్ట్రేలియా పై 24 టెస్టుల్లో 9 సెంచ‌రీలు
స‌చిన్ టెండూల్క‌ర్ (భార‌త్‌) – శ్రీలంక పై 41 టెస్టుల్లో 9 శ‌త‌కాలు
వివి రిచ‌ర్డ్స్ (వెస్టిండీస్‌) – ఇంగ్లాండ్ పై 39 మ్యాచుల్లో 8 సెంచ‌రీలు
సునీల్ గ‌వాస్క‌ర్ (భార‌త్‌) – ఇంగ్లాండ్ పై 16 మ్యాచుల్లో 7 శ‌త‌కాలు.