IND vs AUS : రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్.. గాయపడిన స్టీవ్‌స్మిత్, లబుషేన్.. రెండో టెస్టుకు దూరం..!
రెండో టెస్టు మ్యాచులో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది ఆసీస్.

Marnus Labuschagne and Steve Smith get injured before Day Night Test
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాకు ఆశించిన ఆరంభం దక్కలేదు. పెర్త్ వేదికగా భారత్‌తో జరిగిన తొలి టెస్టు మ్యాచులో 295 పరుగుల భారీ తేడాతో ఓడిపోయింది. ఈ క్రమంలో అడిలైడ్ వేదికగా డిసెంబర్ 6 శుక్రవారం నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచులో ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది ఆసీస్. ఈ క్రమంలో పింక్ బాల్ టెస్టు కోసం ఆసీస్ తీవ్రంగా సన్నద్ధం అవుతోంది. ఆ జట్టు ఆటగాళ్లు నెట్స్‌లో చమటోడ్చుతున్నారు.
అయితే.. రెండో టెస్టుకు ముందు ఆస్ట్రేలియాకు భారీ షాక్ తగిలింది. ఆ జట్టు స్టార్ ఆటగాళ్లు మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్‌లు నెట్ సెషన్‌లో గాయపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అసిస్టెంట్ కోచ్ డానియల్ వెటోరీ బౌలింగ్‌లో లబుషేన్ గాయపడ్డాడు. అయితే.. కొంతసేపటి తరువాత అతడు బ్యాటింగ్ కొనసాగించాడు.
IND vs AUS: ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్.. రోహిత్ శర్మ ఏ స్థానంలో క్రీజులోకి రావాలో చెప్పిన హర్భజన్
మరోవైపు స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో గాయపడినట్లు స్పోర్ట్స్ జర్నలిస్ట్ విమల్‌కుమార్ ధృవీకరించారు. అయితే.. గాయమైన తరువాత స్మిత్ తన ప్రాక్టీస్ నిలిపివేశాడు. మైదానం నుంచి బయటికి వెళ్లినట్లుగా వార్తలు వస్తున్నాయి. అతడి గాయంపై ప్రస్తుతం ఎలాంటి స్పష్టత లేదు. అతడి గాయం గనుక తీవ్రమైనది అయి.. రెండో టెస్టుకు అతడు దూరం అయితే మాత్రం ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లే.
కాగా.. వీరిద్దరి గాయాల గురించి ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు గానీ, ఆటగాళ్లు గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
Is Smith hurt badly? He stopped batting after getting hurt . Hope it’s not too bad. pic.twitter.com/1VOfeNs5tn
— Vimal कुमार (@Vimalwa) December 3, 2024