KKR Captain : ఇదేమీ సిత్రమో..! రూ.23 కోట్ల ఆటగాడు కెప్టెన్సీకి పనికి రాడా..? సారథిగా రూ.1.5 కోట్ల ప్లేయర్..!
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసిన ఐపీఎల్ మెగా వేలం ఇటీవల ముగిసింది.

Ajinkya Rahane to lead KKR in IPL 2025
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూసిన ఐపీఎల్ మెగా వేలం ఇటీవల ముగిసింది. అన్ని జట్లు తమకు కావాల్సిన ఆటగాళ్లను మెగా వేలంలో దక్కించుకున్నాయి. అన్ని ఫ్రాంచైజీలకు కెప్టెన్లు ఎవరో అనేది దాదాపుగా అందరికి ఓ అంచనా వచ్చేసింది. అయితే.. ఒక్క కోల్‌కతా నైట్‌రైడర్స్ విషయంలో మాత్రం కెప్టెన్ ఎవరు అనేది చెప్పలేకపోతున్నారు.
మెగా వేలంలో ఆల్‌రౌండర్ వెంకటేశ్ అయ్యర్‌ను రూ.23.75 కోట్లు వెచ్చించి మరీ సొంతం చేసుకుంది. దీంతో అతడినే సారథిగా నియమిస్తుందని అంతా భావించారు. అయితే.. అతడికి కాకుండా అనుభవం ఉన్న అజింక్యా రహానెకు పగ్గాలు అప్పగించాలని కోల్‌కతా మేనేజ్‌మెంట్ నిర్ణయం తీసుకున్నట్లుగా క్రికెట్ వర్గాలు పేర్కొంటున్నారు. కేకేఆర్ కెప్టెన్‌గా రహానె 90 శాతం ఖరారు అయ్యాడని అంటున్నారు.
వాస్తవానికి మెగా వేలంలో మొదట అజింక్యా రహానెను ఎవ్వరూ తీసుకోలేదు. రెండో రౌండ్‌లో ఆఖరికి కేకేఆర్ అతడి బేస్‌ప్రైజ్ రూ.1.50 కోట్లకే సొంతం చేసుకుంది. రహానెతో పోలిస్తే కేకేఆర్ తీసుకున్న వారిలో ఎవ్వరికి కూడా కెప్టెన్సీలో పెద్గగా అనుభవం పెద్దగా లేదు. ఈ క్రమంలోనే అతడికి సారథ్యం అప్పగించాలని నిర్ణయం తీసుకున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.
శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో ఐపీఎల్ 2024 సీజన్ విజేతగా నిలిచింది కేకేఆర్. అయితే.. మెగా వేలానికి అతడిని విడిచిపెట్టింది. వేలంలో అతడిని రూ.26.75 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.
WTC Final Qualification : భారత్ డబ్ల్యూటీసీ ఫైనల్ చేరుకునేందుకు ఉన్న 4 మార్గాలు ఇవే..
ఇదిలా ఉంటే.. ఐపీఎల్‌లో రహానె కెప్టెన్సీ రికార్డు ఏమంత గొప్పగా లేదు. రాజస్థాన్ రాయల్స్‌కు అతడు 24 మ్యాచుల్లో సారథిగా వ్యవహరించాడు. ఇందులో కేవలం తొమ్మిది మ్యాచుల్లోనే ఆ జట్టు గెలిచింది 15 మ్యాచుల్లో ఓడిపోయింది.