IND vs AUS: ఆస్ట్రేలియాతో రెండో టెస్ట్.. రోహిత్ శర్మ ఏ స్థానంలో క్రీజులోకి రావాలో చెప్పిన హర్భజన్
ఆస్ట్రేలియా వేదికగా బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరుగుతుంది.

Rohit Sharma Harbhajan Singh
IND vs AUS 2nd Test: ఆస్ట్రేలియా వేదికగా బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా జట్ల మధ్య ఐదు టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ జరుగుతుంది. ఇప్పటికే తొలి టెస్టు పెర్త్ వేదికగా జరగ్గా.. ఇండియా ఘన విజయం సాధించింది. రెండో టెస్టు ఈనెల 6వ తేదీ నుంచి ఆడిలైడ్ లో జరగనుంది. మొదటి టెస్టుకు గైర్హాజరైన కెప్టెన్ రోహిత్ శర్మ రెండో టెస్టుకు అందుబాటులోకి వచ్చాడు. దీంతో ఆడిలైడ్ టెస్టులో రోహిత్ బ్యాటింగ్ ఆర్డర్ లో ఏ స్థానంలో వస్తాడనేది క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా రోహిత్ శర్మ ఓపెనర్ గా క్రీజులో వస్తాడు. రెండో టెస్టులో అతను ఓపెనర్ గానే వస్తాడా.. రెండు, మూడు స్థానాల్లో బ్యాటింగ్ కు వస్తాడా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. తాజాగా ఈ విషయంపై టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Also Read: PV Sindhu : త్వరలో పెళ్లిపీటలెక్కనున్న పీవీ సింధూ.. వ్యాపారవేత్తతో వివాహం.. ఎప్పుడంటే?
పెర్త్ వేదికగా జరిగిన మొదటి టెస్టులో రోహిత్ గైర్హాజరీతో యశస్వి జైస్వాల్ తోపాటు కేఎల్ రాహుల్ ఓపెనర్ గా బరిలోకి దిగాడు. వీరిద్దరి జోడీ రెండో ఇన్నింగ్స్ లో మెరుగైన ప్రదర్శన చేసింది. దీంతో ఈ ఓపెనింగ్ జోడీని రెండో టెస్టులోనూ కొనసాగించాలన్న అభిప్రాయాన్ని మాజీ క్రికెటర్లు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రెండో టెస్టుకు శుభ్ మన్ గిల్ సైతం అందుబాటులోకి వచ్చాడు. ఈ క్రమంలో రాహుల్ ను రెండో టెస్టుకు పక్కన పెట్టి రోహిత్ శర్మ అతని స్థానంలో బరిలోకి దిగుతాడని తెలుస్తోంది. ఒకవేళ రాహుల్ ఓపెనర్ గా బరిలోకి దిగితే రోహిత్ శర్మ ఐదు, ఆరు స్థానాల్లో బ్యాటింగ్ వస్తాడా అనే విషయంపైనా చర్చ జరుగుతుంది.
టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మాట్లాడుతూ.. రోహిత్ శర్మ ఐదు లేదా ఆరో నెంబర్ లో బ్యాటింగ్ కు వస్తాడని అనుకోవడం లేదు. రోహిత్ శర్మ ఓపెనింగ్ లో యశస్వి జైస్వాల్ తో కలిసి క్రీజులోకి వస్తాడు. కేఎల్ రాహుల్ మూడో స్థానంలో వస్తాడు.. లేదంటే ఆ తరువాత స్థానాల్లో క్రీజులోకి వచ్చే అవకాశం ఉంటుంది. రోహిత్ శర్మ ఆరో నెంబర్ లో బ్యాటింగ్ చేయడం మంచిది కాదు. బ్యాటింగ్ ఆర్డర్ లో మొదటి నాలుగు స్థానాల్లో కీలక బ్యాటర్లు క్రీజులోకి రావాలి. అగ్రస్థానంలో ఉన్న రోహిత్ శర్మ లాంటి వ్యక్తి ఓపెనర్ గా బరిలోకి దిగితేనే మిగిలిన బ్యాటర్లకు మరింత ప్రోత్సాహాన్ని అందిస్తాడని హర్భజన్ సింగ్ అన్నారు.