Nicholas Pooran : రిషబ్ పంత్ స్టైల్‌లో సిక్స్ కొట్టిన నికోలస్ పూరన్.. బౌలర్లకు గడ్డు కాలమే ఇక..!
టీ20 క్రికెట్‌లో విధ్వంసకర వీరుల్లో నికోలస్ పూరన్ ఒకడు.

Pooran Turns Heads With Rishabh Pant Esque Wild Scoop In Abu Dhabi T10
Nicholas Pooran – Rishabh Pant : టీ20 క్రికెట్‌లో విధ్వంసకర వీరుల్లో నికోలస్ పూరన్ ఒకడు. ఇప్పటికే ఈ విండీస్ ఆటగాడు పొట్టి క్రికెట్‌లో ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. తాజాగా అబుదాబి టీ10 లీగ్‌లో అతడు కొట్టిన ఓ సిక్స్‌కు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అబుదాబి టీ10 లీగులో రిషబ్ పంత్ డెక్కన్ గ్లాడియేటర్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. క్వాలిఫయిర్-1లో భాగంగా డెక్కన్ గ్లాడియేటర్స్, మోరిస్‌విల్లే సాంప్ ఆర్మీలు తలపడ్డాయి. ఈ మ్యాచ్‌లో పూరన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 33 బంతులు ఎదుర్కొన్న పూరన్ 4 ఫోర్లు, 5 సిక్సర్లు బాది 72 పరుగులతో తన జట్టుకు విజయాన్ని అందించాడు.
తొమ్మిదో ఓవర్‌లో అతడు కొట్టిన ఓ సిక్స్ మ్యాచ్‌కే హైలెట్ గా నిలిచింది. టీమ్ఇండియా స్టార్ ఆటగాడు రిషబ్ పంత్ స్టైల్‌లో స్కూప్ షాట్‌తో అలరించాడు. మహ్మద్ జాహిద్ తొమ్మిదో ఓవర్‌ను వేశాడు. ఈ ఓవర్‌లోని ఓ బంతిని అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ మీదుగా పుల్ టాస్‌గా వేశాడు. పూరన్ నేలపై పడిపోయి మరీ పైన్ లెగ్ మీదుగా సిక్సర్ కొట్టాడు. నడుము కంటే ఎక్కువ ఎత్తు రావడంతో ఈ బంతిని థర్డ్ అంపైర్ నోబాల్‌గా ప్రకటించాడు.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 2025 సీజన్‌లో రిషబ్ పంత్, నికోలస్ పూరన్‌లు ఒకే ఫ్రాంచైజీ తరుపున ఆడనున్నారు. ఇటీవల జరిగిన మెగా వేలంలో లక్నో జట్టు రిషబ్ పంత్ ను రూ.27 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. పూరన్‌ను రూ.21 కోట్లకు రిటైన్ చేసుకుంది.
Is there any shot that Nicholas Pooran can’t play? 🤩#ADT10onFanCode pic.twitter.com/OKfM2qtJ5Z
— FanCode (@FanCode) December 1, 2024