Virat Kohli eye Don Bradman and Sachin Tendulkar historic test records
ఆస్ట్రేలియా పర్యటనలో టీమ్ఇండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ ఫామ్ అందుకున్నాడు. పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు మ్యాచ్‌లో భారత్ 295 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ భారత్ గెలవడంలో కోహ్లీ తన వంతు పాత్ర పోషించాడు. రెండో ఇన్నింగ్స్‌లో అజేయ శతకం బాదాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత జట్టు ఆస్ట్రేలియాతో మరో నాలుగు టెస్టు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ నాలుగు మ్యాచుల్లో కోహ్లీ కనీసం ఒక్క సెంచరీ చేసిన పలు రికార్డులను అందుకుంటాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక శతకాలు బాదిన ప్లేయర్‌గా రికార్డులకు ఎక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ పేరిట సంయుక్తంగా ఉంది. వీరిద్దరు చెరో తొమ్మిది సెంచరీలు బాదాడు. సచిన్ 65 ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత అందుకుంటే కోహ్లీ 44 ఇన్నింగ్స్‌ల్లోనే దీన్ని అందుకున్నాడు.
MS Dhoni : జానపద గీతానికి ధోని డ్యాన్స్.. వీడియో వైరల్
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు..
సచిన్ టెండూల్కర్ – 65 ఇన్నింగ్స్‌ల్లో 9 సెంచరీలు
విరాట్ కోహ్లీ – 44 ఇన్నింగ్స్‌ల్లో 9 శతకాలు
రికీ పాంటింగ్ – 51 ఇన్నింగ్స్‌ల్లో 8 సెంచరీలు
స్టీవ్ స్మిత్ – 37 ఇన్నింగ్స్‌ల్లో 8 శతకాలు
మైకేల్ కార్క్ – 40 ఇన్నింగ్స్‌ల్లో 7 శతకాలు
76 ఏళ్ల బ్రాడ్‌మన్ రికార్డు..
నాలుగు మ్యాచుల్లో కోహ్లీ ఒక్క సెంచరీ చేసినా డ్రాన్ బ్రాడ్‌మన్ రికార్డు కూడా బద్దలు కొడతాడు. ఓ జట్టుపై అత్యధిక సెంచరీలు చేసిన పర్యాటక బ్యాటర్‌గా విరాట్ రికార్డులకు ఎక్కుతాడు. ప్రస్తుతం ఈ రికార్డు బ్రాడ్‌మన్ పేరిట ఉంది. ఇంగ్లాండ్ పై బ్రాడ్ మన్ 11 శతకాలు బాదాడు. కాగా.. కోహ్లీ ఆస్ట్రేలియాపై 10 సెంచరీలు చేశాడు.
ఓ జట్టు పై అత్యధిక సెంచరీలు చేసిన పర్యాటక బ్యాటర్లు వీరే..
డాన్ బ్రాడ్‌మన్ (ఆస్ట్రేలియా) – ఇంగ్లాండ్ పై 19 టెస్టుల్లో 11 సెంచరీలు
విరాట్ కోహ్లీ (భారత్) – ఆస్ట్రేలియాపై 43 టెస్టుల్లో 10 సెంచరీలు
జేబీ హాబ్స్ (ఇంగ్లాండ్) – ఆస్ట్రేలియా పై 24 టెస్టుల్లో 9 సెంచరీలు
సచిన్ టెండూల్కర్ (భారత్) – శ్రీలంక పై 41 టెస్టుల్లో 9 శతకాలు
వివి రిచర్డ్స్ (వెస్టిండీస్) – ఇంగ్లాండ్ పై 39 మ్యాచుల్లో 8 సెంచరీలు
సునీల్ గవాస్కర్ (భారత్) – ఇంగ్లాండ్ పై 16 మ్యాచుల్లో 7 శతకాలు.