Prithvi Shaw : ఇది క‌ద‌రా పృథ్వీ షా అంటే.. మూడు బంతుల్లో.. మారేదే లే..!

టీమ్ఇండియా ఆట‌గాడు పృథ్వీ షా ఆట‌తీరు ఏ మాత్రం మార‌డం లేదు.

Prithvi Shaw : ఇది క‌ద‌రా పృథ్వీ షా అంటే.. మూడు బంతుల్లో.. మారేదే లే..!

Prithvi Shaw Woeful Run Continues in Syed Mushtaq Ali Trophy

Updated On : December 3, 2024 / 5:45 PM IST

టీమ్ఇండియా ఆట‌గాడు పృథ్వీ షా ఆట‌తీరు ఏ మాత్రం మార‌డం లేదు. జ‌ట్టులో స్థానం కోల్పోయిన‌ప్ప‌టికి అత‌డు త‌న‌ ఆట‌పై ఫోక‌స్ చేసిన‌ట్లుగా క‌నిపించ‌డం లేదు. ఇటీవ‌ల జ‌రిగిన ఐపీఎల్ మెగా వేలం 2025 లోనూ అత‌డిని ఏ జ‌ట్టు తీసుకోలేదు. ఈ క్ర‌మంలో త‌న‌ను తాను నిరూపించుకుని, దేశ‌వాలీ టోర్నీల్లో ప‌రుగుల వ‌ర‌ద పారించి తిరిగి జాతీయ జ‌ట్టులో చోటు ద‌క్కించుకుంటాడ‌ని అత‌డి అభిమానులు భావించ‌గా వారి ఆశ‌లు అడియాశ‌లే అవుతున్నాయి.

స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో త‌న పేల‌వ ఫామ్‌ను కంటిన్యూ చేస్తున్నాడు. మంగ‌ళ‌వారం సర్వీసెస్‌తో జ‌రిగిన మ్యాచ్‌లో డ‌కౌట్ అయ్యాడు. ఈ మ్యాచ్‌లో మూడు బంతులు ఎదుర్కొన్న ఈ రైట్ హ్యాండ్ బ్యాట‌ర్ మీడియం పేస‌ర్ పునియా బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. కాగా.. ప్ర‌స్తుత టోర్నీలో పృథ్వీ షా డ‌కౌట్ కావ‌డం ఇది రెండో సారి. న‌వంబ‌ర్ 27 (బుధ‌వారం) మ‌హారాష్ట్ర‌తో జ‌రిగిన మ్యాచ్‌లోనూ ఈ ముంబై బ్యాట‌ర్ డ‌కౌట్ అయ్యాడు.

Babar Azam : వైరల్ హ్యాండ్‌షేక్ వీడియో.. బాబ‌ర్ ఆజామ్‌ను ప‌ట్టించుకోని పిల్లాడు..? అస‌లు నిజం ఇదే..

క్ర‌మ‌శిక్ష‌ణ లేక‌పోవ‌డం, ఫిట్‌నెస్ సమస్యల కారణంగా ఇటీవ‌ల ముంబై రంజీ జ‌ట్టు నుంచి అత‌డిని త‌ప్పించారు. స‌య్య‌ద్ ముస్తాక్ అలీ ట్రోఫీకి ఎంపిక చేసిన‌ప్ప‌టికి పృథ్వీ తీరు మార‌న‌ట్లుగా తెలుస్తోంది.

ఇక మ్యాచ్ విష‌యానికి వ‌స్తే.. ఈ మ్యాచ్‌లో ముంబై తొలుత బ్యాటింగ్ చేసింది. పృథ్వీ షా డ‌కౌట్ అయినా.. సూర్య‌కుమార్ యాద‌వ్ (46 బంతుల్లో 70), శివ‌మ్ దూబె (37 బంతుల్లో 71 నాటౌట్‌) దంచికొట్ట‌డంతో నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో 4 వికెట్ల న‌ష్టానికి 192 ప‌రుగులు చేసింది.

IND vs AUS : ఆస్ట్రేలియాతో రెండో టెస్టు.. కోహ్లీ, ద్ర‌విడ్ రికార్డుల‌పై య‌శ‌స్వి జైస్వాల్ క‌న్ను..

అనంత‌రం స‌ర్వీసెస్ 19.3 ఓవ‌ర్ల‌లో 153 ప‌రుగుల‌కే ఆలౌటైంది. దీంతో ముంబై జ‌ట్టు 39 ప‌రుగుల తేడాతో విజ‌యం సాధించింది. ముంబై బౌల‌ర్ల‌లో శార్దూల్ ఠాకూర్ నాలుగు వికెట్లు తీశాడు. షామ్స్ ములానీ మూడు వికెట్లు ప‌డ‌గొట్టాడు.