Babar Azam : వైరల్ హ్యాండ్‌షేక్ వీడియో.. బాబ‌ర్ ఆజామ్‌ను ప‌ట్టించుకోని పిల్లాడు..? అస‌లు నిజం ఇదే..

మ‌న పొరుగున పాకిస్థాన్‌లో కూడా క్రికెట్‌ను అమితంగా ఇష్ట‌ప‌డుతుంటారు.

Babar Azam : వైరల్ హ్యాండ్‌షేక్ వీడియో.. బాబ‌ర్ ఆజామ్‌ను ప‌ట్టించుకోని పిల్లాడు..? అస‌లు నిజం ఇదే..

Was Babar Azam Ignored By A Kid In Viral Handshake Video

Updated On : December 3, 2024 / 5:11 PM IST

మ‌న దేశంలో క్రికెట్ కు ఉన్న క్రేజ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌ని లేదు. ఇక మ‌న పొరుగున పాకిస్థాన్‌లో కూడా క్రికెట్‌ను అమితంగా ఇష్ట‌ప‌డుతుంటారు. క్రికెట‌ర్లు క‌న‌బ‌డితే చాలు ఆటోగ్రాఫ్‌లు, సెల్పీలు అంటూ చుట్టు ముట్టేస్తారు. ఇక పాకిస్థాన్ స్టార్ క్రికెట‌ర్ బాబ‌ర్ ఆజామ్‌కు మంచి క్రేజ్ ఉంది. అయితే.. అత‌డు ఓ వివాహానికి హాజ‌రు అయ్యాడు. అక్క‌డ ఓ చిన్న‌పిల్ల‌వాడు బాబ‌ర్ ను ప‌ట్టించుకోలేదు. స‌రిక‌దా అత‌డికి కాకుండా మిగిలిన అంద‌రికి షేక్‌హ్యాండ్ ఇస్తున్నా ఓ వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

దీన్ని షేర్ చేస్తూ.. పిల్లలు కూడా బాబర్‌ను విస్మరిస్తున్నారు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియోలో ఓ పిల్ల‌వాడు వ‌చ్చి బాబ‌ర్ ప‌క్క‌న ఉన్న‌వారందరికి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. బాబ‌ర్ చేయి చాపిన‌ప్ప‌టికి అత‌డికి మాత్రం ఇవ్వ‌లేదు. వెంట‌నే బాబ‌ర్ త‌న చేతుల‌ను వెన‌క్కి లాగేసుకున్న‌ట్లుగా ఉంది.

IND vs AUS : ఆస్ట్రేలియాతో రెండో టెస్టు.. కోహ్లీ, ద్ర‌విడ్ రికార్డుల‌పై య‌శ‌స్వి జైస్వాల్ క‌న్ను..

అయితే.. ఇందుకు సంబంధించిన ఓ పూర్తి వీడియో బ‌య‌ట‌కు వ‌చ్చింది. ఆ వీడియోలో ముందుగా పిల్ల‌వాడు బాబ‌ర్ ఆజామ్‌కి షేక్ హ్యాండ్ ఇచ్చాడు. ఆ త‌రువాత మిగిలిన వారికి ఇచ్చిన‌ట్లుగా క‌నిపిస్తోంది.

IND vs AUS : ఆస్ట్రేలియాతో రెండో టెస్టు.. కోహ్లీ ఒక్క శ‌త‌కం చేస్తే.. అటు స‌చిన్‌, ఇటు బ్రాడ్ మ‌న్ రెండు రికార్డులు బ్రేక్‌