Naveen ul Haq : విరాట్ కోహ్లీతో గొడ‌వ పెట్టుకున్న న‌వీన్ ఉల్ హక్.. కీల‌క నిర్ణ‌యం.. తిట్టిపోస్తున్న సొంత అభిమానులు

భార‌త అభిమానుల‌కు అఫ్గానిస్థాన్ యువ పేస‌ర్ న‌వీన్ ఉల్ హ‌క్ సుప‌రిచితుడే. ఐపీఎల్ 2023లో టీమ్ఇండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ తో గొడ‌వ పెట్టుకున్న ఇత‌డిని భార‌త అభిమానులు అంత త్వ‌ర‌గా మ‌రిచిపోరు.

Naveen ul Haq announces ODI retirement

Naveen ul Haq ODI retirement : భార‌త అభిమానుల‌కు అఫ్గానిస్థాన్ యువ పేస‌ర్ న‌వీన్ ఉల్ హ‌క్ (Naveen ul Haq ) సుప‌రిచితుడే. ఐపీఎల్ 2023లో టీమ్ఇండియా స్టార్ బ్యాట‌ర్ విరాట్ కోహ్లీ (Virat Kohli) తో గొడ‌వ పెట్టుకున్న ఇత‌డిని భార‌త అభిమానులు అంత త్వ‌ర‌గా మ‌రిచిపోరు. అయితే.. 24 ఏళ్ల ఈ యువ ఆట‌గాడు కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. వ‌న్డే క్రికెట్‌కు వీడ్కోలు ప‌ల‌కాల‌ని నిర్ణ‌యించుకున్నాడు. అక్టోబ‌ర్ 5 నుంచి న‌వంబ‌ర్ 19 వ‌ర‌కు జ‌ర‌గ‌నున్న వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ త‌రువాత వ‌న్డే ఫార్మాట్‌కు గుడ్ బై చెబుతున్న‌ట్లు ప్ర‌క‌టించాడు.

పూర్తిగా టీ20 ల‌పై ఫోక‌స్ పెట్టేందుకు వ‌న్డేల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు సోష‌ల్ మీడియా వేదిక‌గా వెల్ల‌డించాడు. న‌వీన్ ఉల్ హ‌క్ ఇప్ప‌టి వ‌ర‌కు అఫ్గానిస్థాన్ త‌రుపున 7 వ‌న్డేలు మాత్ర‌మే ఆడాడు. మొత్తంగా 14 వికెట్లు తీశాడు. ‘అఫ్గానిస్థాన్‌కు ప్రాతినిధ్యం వ‌హించ‌డం చాలా గొప్ప గౌర‌వంగా భావిస్తున్నాను. అయిన‌ప్ప‌టికీ ఈ ప్ర‌పంచ‌క‌ప్ త‌రువాత వ‌న్డే ఫార్మాట్‌కు రిటైర్మెంట్ ప్ర‌క‌టిస్తున్నాను. నా దేశం కోసం టీ20 ఫార్మాట్‌లో ఆడ‌తాను. ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం అంత తేలికైన విష‌యం కాదు. నా కెరీర్‌ను పొడిగించుకునేందుకు ఈ క‌ఠిన నిర్ణ‌యం తీసుకోవాల్సి వ‌చ్చింది. అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు, అభిమానులు, నాకు మ‌ద్ద‌తు ఇచ్చిన అంద‌రికి కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నాను.’ అంటూ న‌వీన్ ఉల్ హ‌క్ సోష‌ల్ మీడియాలో ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశాడు.

మండిప‌డుతున్న ఫ్యాన్స్‌..

వ‌న్డేల నుంచి త‌ప్పుకోవాల‌ని నవీన్ ఉల్ హక్ తీసుకున్న నిర్ణ‌యం పై సొంత అభిమానులే మండిప‌డుతున్నారు. ఫ్రాంచైజీ క్రికెట్ పై ఉన్న మోజుతోనే అత‌డు ఇలాంటి నిర్ణ‌యం తీసుకున్నాడ‌ని అంటున్నారు.

BCCI : 1,47,000 మొక్క‌ల‌ను నాటిన బీసీసీఐ.. స‌రిగ్గా అన్నే మొక్క‌ల‌ను ఎందుకు నాటారంటే..?

ఆట‌కంటే వివాదాల‌తో ఎక్కువ గుర్తింపు..

ఈ యువ ఆట‌గాడు తన ఆట తీరుతో కంటే వివాదాలతోనే ఎక్కువ గుర్తింపు పొందాడు. ఏ లీగులు ఆడిన అక్క‌డ ఎవ‌రితో ఒక‌రితో గొడ‌వ పెట్టుకుంటూనే ఉంటాడు. పాకిస్థాన్ ప్రీమియర్ లీగ్(PSL)లో పాక్ దిగ్గ‌జ ఆట‌గాడు షాహిద్ అఫ్రిదితో గొడ‌వ ప‌డ్డాడు. ఇక ఐపీఎల్‌లో ల‌క్నో సూప‌ర్ జెయింట్స్‌కు ప్రాతినిధ్యం వ‌హించిన న‌వీన్‌.. భార‌త స్టార్ ఆట‌గాడు విరాట్ కోహ్లీతో వాగ్వాదానికి దిగాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. మ్యాచ్ ముగిసిన త‌రువాత న‌వీన్ త‌రుపున గౌత‌మ్ గంభీర్ కూడా విరాట్‌తో వాదించ‌డంతో ఇది కాస్త గంభీర్‌-కోహ్లీ ల మ‌ధ్య పెద్ద గొడ‌వ‌కు దారి తీసింది. అప్ప‌ట్లో ఇది పెద్ద చ‌ర్చ‌నీయాంశ‌మైన సంగ‌తి తెలిసిందే.

అంతటితో ఆగ‌ని నవీన్ ఉల్ హక్..సోషల్ మీడియా వేదికగా కోహ్లీ బ్యాటింగ్‌ను ఉద్దేశించి మామిడి పండ్లు బాగున్నాయని ట్రోల్ చేశాడు. దీంతో అప్ప‌టి నుంచి న‌వీన్ ఉల్ హ‌క్ అంటేనే విరాట్ కోహ్లీ అభిమానులు మండిప‌డుతుంటారు. వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్‌లో భాగంగా అక్టోబర్ 11న ఢిల్లీ వేదికగా భార‌త్‌, అఫ్గానిస్తాన్ జ‌ట్లు త‌ల‌పడ‌నున్నాయి. ఈ మ్యాచ్ లో న‌వీన్‌, కోహ్లీల మ‌ధ్య పోరాటాన్ని చూసేందుకు అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎద‌రుచూస్తున్నారు.

Pujara : ఇక చాలు.. యువ‌కుల‌కు ఛాన్స్ ఇవ్వు.. పుజారాకు ధావ‌న్ కౌంట‌ర్‌

ట్రెండింగ్ వార్తలు