Yusuf Pathan: సచిన్ టెండూల్కర్ తర్వాత యూసఫ్ పఠాన్‌కు కొవిడ్ పాజిటివ్

ఇండియా లెజెండ్స్ టీమ్ మేట్ మరొకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టోర్నమెంట్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో పాల్గొన్న టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ కు పాజిటివ్ వచ్చింది.

After Sachin Tendulkar Yusuf Pathan Tests Positive For Covid 19

Yusuf Pathan: ఇండియా లెజెండ్స్ టీమ్ మేట్ మరొకరికి కరోనా పాజిటివ్ వచ్చింది. రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ టోర్నమెంట్ లో భాగంగా జరిగిన మ్యాచ్ లో పాల్గొన్న టీమిండియా దిగ్గజం సచిన్‌ టెండూల్కర్ కు పాజిటివ్ వచ్చింది. ఆ రెండ్రోజులకే యూసఫ్ పటాన్ కు పాజిటివ్ గా తేలినట్లు సోషల్ మీడియాలో అనౌన్స్ చేశారు.

‘స్వల్ప లక్షణాలు కనిపించడంతో కొవిడ్ టెస్టులు చేయించుకున్నా. కన్ఫామ్ అయిన తర్వాత స్వయంగా ఇంట్లోనే క్వారంటైన్ లో ఉన్నా. అవసరమైన మెడికేషన్, జాగ్రత్తలు అన్నీ తీసుకుంటున్నా. నాతో కాంటాక్ట్ అయిన వారు ముందస్తుగా టెస్టులు చేయించుకోండి’ అని ట్వీట్ చేశాడు యూసఫ్ పఠాన్.

అంతే కంటే ముందు రోజు సచిన్ టెస్టు చేయించుకుని పాజిటివ్ వచ్చిందని సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. కొవిడ్ టెస్టు చేయించుకున్నాను. నాకొక్కడికే పాజిటివ్ వచ్చింది. కుటుంబమంతా జాగ్రత్తగా ఉన్నారు. డాక్టర్లు చెప్పినట్లుగా ఇంట్లోనే క్వారంటైన్ లో ఉంటున్నా. నాకు సపోర్ట్ చేస్తున్న హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కు థ్యాంక్స్. మీరు అంతా జాగ్రత్తగా ఉండండి అని స్టేట్ మెంట్ ఇచ్చాడు.

రోడ్ సేఫ్ట్ వరల్డ్ సిరీస్ టోర్నమెంట్ లో ఆడిన సచిన్, యూసఫ్ ల ఇండియా లెజెండ్స్ టీం టైటిల్ గెలుచుకోగలిగింది.