Aakash Chopra : వైస్ కెప్టెన్‌కి చోటు లేదా..? ఇషాన్ కిష‌న్ ప‌రిస్థితేంటి..?

టీమ్ఇండియా సెలక్టర్ల నిర్ణయాలను అర్థం చేసుకోవడం కష్టమని మాజీ క్రికెట‌ర్‌, వ్యాఖ్యాత‌ ఆకాశ్ చోప్రా అన్నాడు.

Akash Chopra highlights shocking selection process for Afghanistan T20I series

Aakash Chopra comments : అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్ కు సెల‌క్ట‌ర్లు భార‌త జ‌ట్టును ఆదివారం ప్ర‌క‌టించారు. అప్ప‌టి నుంచి సెల‌క్ట‌ర్ల పై విమ‌ర్శ‌లు వ‌స్తూనే ఉన్నాయి. ఏడాదికి పైగా టీ20లకు దూరంగా ఉన్న టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాళ్లు రోహిత్ శ‌ర్మ‌, విరాట్ కోహ్లీల‌ను అఫ్గాన్ సిరీస్‌కు ఎంపిక చేశారు. ఈ నిర్ణ‌యాన్ని చాలా మంది స్వాగ‌తిస్తున్నారు. అయితే.. జ‌ట్టులో ఖ‌చ్చితంగా ఉంటారు అనుకున్న ఆట‌గాళ్లు లేక‌పోవ‌డాన్ని మాత్రం త‌ప్పుబ‌డుతున్నారు.

కేఎల్ రాహుల్‌, శ్రేయ‌స్ అయ్య‌ర్‌, ర‌వీంద్ర జ‌డేజా, ఇషాన్ కిష‌న్ వంటి ఆట‌గాళ్లుకు జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. దీనిపై సోష‌ల్ మీడియాలో పెద్ద ఎత్తున చ‌ర్చ న‌డుస్తోంది. కాగా.. టీమ్ఇండియా సెలక్టర్ల నిర్ణయాలను అర్థం చేసుకోవడం కష్టమని మాజీ క్రికెట‌ర్‌, వ్యాఖ్యాత‌ ఆకాశ్ చోప్రా అన్నాడు. శ్రేయ‌స్ అయ్య‌ర్‌, ఇషాన్ కిష‌న్‌ల గైర్హాజ‌రు, శివ‌మ్ దూబె రీ ఎంట్రీ గురించి అత‌డు మాట్లాడాడు.

Mohammed Shami : రాష్ట్ర‌ప‌తి చేతుల మీదుగా అర్జున అవార్డు.. క‌ల నెర‌వేరింద‌న్న ష‌మీ

వైస్ కెప్టెన్‌కు చోటు లేదా..?

వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ముగిసిన త‌రువాత టీమ్ఇండియా స్వ‌దేశంలో ఆస్ట్రేలియాతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్ ఆడింది. ఈ సిరీస్‌కు శ్రేయ‌స్ అయ్య‌ర్ ను వైస్‌కెప్టెన్ గా నియ‌మించారు. ద‌క్షిణాఫ్రికాతో జ‌రిగిన టీ20 సిరీస్‌లోనూ అయ్య‌ర్ ఆడాడు. అయితే.. అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్‌లో అత‌డికి ఎందుకు చోటు ద‌క్క‌లేద‌ని చోప్రా ప్ర‌శ్నించాడు.

ఇక ఆల్‌రౌండ‌ర్ శివ‌మ్ దూబె ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్‌కు జ‌ట్టులో ఉన్నాడు. అత‌డిని ద‌క్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌కు ప‌క్క‌న బెట్టారు. మ‌ళ్లీ ఇప్పుడు అఫ్గానిస్తాన్‌తో టీ20 సిరీస్‌కు ఎందుకు ఎంపిక చేశారో అర్థం కావ‌డం లేద‌న్నాడు. అలాగే.. ఇషాన్ కిష‌న్ ఎక్క‌డ ఉన్నాడు. అత‌డి గురించిన ఏమైన స‌మాచారం ఉందా లేదా..? అని చోప్రా సెల‌క్ట‌ర్ల తీరుపై మండిప‌డ్డాడు.

Rohit Sharma : చిక్కుల్లో భార‌త కెప్టెన్ రోహిత్ శ‌ర్మ‌..? చ‌ర్య‌లు తీసుకునేందుకు సిద్ద‌మౌవుతున్న‌ ఐసీసీ..?

ఇదిలా ఉంటే.. జ‌న‌వ‌రి 11 నుంచి భార‌త్, అఫ్గానిస్తాన్ జ‌ట్ల మ‌ధ్య మూడు మ్యాచుల టీ20 సిరీస్ ఆరంభం కానుంది.

అఫ్గానిస్తాన్‌తో సిరీస్‌కు భార‌త జ‌ట్టు ఇదే..
రోహిత్ శర్మ (కెప్టెన్‌), విరాట్ కోహ్లీ, శుభ్‌మ‌న్‌ గిల్, య‌శ‌స్వి జైస్వాల్, తిలక్ వర్మ, రింకూ సింగ్, జితేష్ శర్మ (వికెట్ కీప‌ర్‌), సంజు శాంసన్ (వికెట్ కీప‌ర్‌), శివమ్ దూబే, వాషింగ్ట‌న్‌ సుందర్, అక్షర్ పటేల్, రవి బిష్ణోయ్, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్ , అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

భారత్ vs అఫ్గానిస్తాన్ టీ20 సిరీస్ షెడ్యూల్ ఇదే..
* జ‌న‌వ‌రి 11న తొలి టీ20 – మొహాలి
* జ‌న‌వ‌రి 14న రెండ‌వ టీ20 – ఇండోర్‌
* జ‌న‌వ‌రి 17న మూడో టీ20 – బెంగ‌ళూరు

ట్రెండింగ్ వార్తలు