Alex Steele : క్రికెట్ అంటే పిచ్చి.. 83 ఏళ్ల వ‌య‌సులో ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ పెట్టుకుని మ‌రీ వికెట్ కీపింగ్‌..

ఓ పెద్దాయ‌న‌కు క్రికెట్ అంటే పిచ్చి. ఎంత అంటే ఓ వైపు తీవ్ర అనారోగ్యం బాధిస్తుండ‌గా, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ లేక‌పోతే జీవించ‌డం క‌ష్ట‌మైనా స‌రే ఆయ‌న క్రికెట్ మ్యాచ్ చూడాల‌ని అనుకోలేదు.. ఆడాల‌ని అనుకున్నాడు.

Scottish player Alex Steele

Scottish player Alex Steele : క్రికెట్ గేమ్‌ను అన్ని వ‌య‌సుల వారు ఇష్ట‌ప‌డుతుంటారు. చిన్న పిల్ల‌లే కాదు పెద్ద‌వాళ్లు సైతం మ్యాచ్‌ల‌ను చూసి ఆనందిస్తుంటారు. ప్ర‌పంచ‌క‌ప్ వంటి టోర్నీల‌తో పాటు ప్ర‌త్యేక మ్యాచులు ఉన్న సంద‌ర్భాల్లో కొంద‌రు కాలేజీల‌కు బంక్ కొట్టి, ఇంకొంద‌రు ఆఫీసుల‌కు సెల‌వు పెట్టి మ్యాచుల‌ను చూస్తుంటారు. అయితే.. ఓ పెద్దాయ‌న‌కు క్రికెట్ అంటే పిచ్చి. ఎంత అంటే ఓ వైపు తీవ్ర అనారోగ్యం బాధిస్తుండ‌గా, ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ లేక‌పోతే జీవించ‌డం క‌ష్ట‌మైనా స‌రే ఆయ‌న క్రికెట్ మ్యాచ్ చూడాల‌ని అనుకోలేదు.. ఆడాల‌ని అనుకున్నాడు. అంతేనా మ్యాచ్ కూడా ఆడాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

స్కాట్‌లాండ్ మాజీ ఆట‌గాడు అలెక్స్ స్టీల్ (Alex Steele ) వ‌య‌సు 83 సంవ‌త్స‌రాలు. 2020లో అత‌డికి ఇడియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్, టెర్మినల్ రెస్పిరేటరీ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది. ఊపిరితిత్తుల‌కు సంబంధించిన ఈ వ్యాధి కార‌ణంగా అత‌డు శ్వాస తీసుకోవ‌డం చాలా క‌ష్టంగా మారింది. అప్ప‌టి నుంచి అత‌డు ఆక్సిజ‌న్ స‌పోర్టుతోనే త‌న జీవితాన్ని కొన‌సాగిస్తున్నాడు. ఈ వ్యాధి బారిన ప‌డిన వారు మూడు లేదంటే నాలుగు సంవ‌త్స‌రాలు మాత్ర‌మే జీవించే అవ‌కాశం ఉంది.

IND VS WI 2nd T20 : సూర్య‌కుమార్ యాద‌వ్‌ను ఊరిస్తున్న భారీ రికార్డు.. రోహిత్‌, కోహ్లి త‌రువాత స్కైకి అద్భుత అవ‌కాశం..!

అయితే.. అలెక్స్ కు క్రికెట్ ఆడాల‌ని అనిపించింది. త‌న అనారోగ్యాన్ని సైతం లెక్క‌చేయ‌కుండా వీపుకు ఆక్సిజ‌న్ సిలిండ‌ర్ పెట్టుకుని మ‌రీ అత‌డు స్థానిక క్ల‌బ్ క్రికెట్ ఆడాడు. అత‌డు వికెట్ కీపింగ్ చేస్తున్న వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఆట‌పై అత‌డికి ఉన్న ఇష్టం పై స‌ర్వ‌త్రా ప్రశంస‌ల వ‌ర్షం కురుస్తోంది.

1967లో లంకాషైర్‌తో జరిగిన మ్యాచ్‌లో స్కాట్లాండ్ త‌రుపున స్టీల్ ఫస్ట్-క్లాస్ అరంగేట్రం చేశాడు. స్టీల్ మొత్తం పద్నాలుగు ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో ఆడాడు. 24.84 సగటుతో 621 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 97. ఐర్లాండ్‌పై రెండు అర్ధ సెంచరీలు చేశాడు. వికెట్ కీపర్‌గా అతను 11 క్యాచ్‌లు ప‌ట్టుకోవ‌డంతో పాటు రెండు స్టంపౌట్‌లు చేశాడు.

Prithvi Shaw : ద‌రిద్రం నీ వెంటే ఉందా భ‌య్యా..! విచిత్ర రీతిలో పృథ్వీ షా ఔట్‌.. వీడియో

ట్రెండింగ్ వార్తలు