Hardik Pandya : బాధతో ఒంటరిగా డగౌట్‌లో కూర్చున్న పాండ్య.. వెళ్లి ఓదార్చిన అంబటి రాయుడు
ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఏదీ కలిసి రావడం లేదు.
- Thota Vamshi Kumar
- Published On : April 3, 2024 / 12:04 PM IST
Ambati Rayudu consoles Hardik Pandya after hammering vs RR
ఐపీఎల్ 17వ సీజన్‌లో ముంబై ఇండియన్స్‌కు ఏదీ కలిసి రావడం లేదు. వరుసగా మూడు మ్యాచుల్లో గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ చేతుల్లో ఓడిపోయింది. గెలుపు బోణీ కొట్టని ముంబై పాయింట్ల పట్టికలో ఆఖరి స్థానంలో కొనసాగుతోంది. ఎస్ఆర్‌హెచ్‌తో మ్యాచ్‌లో 277 పరుగులు ఇచ్చి.. ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించుకున్న జట్టుగా పేలవ రికార్డును నమోదు చేసింది.
ఈ సీజన్‌కు ముందు జట్టుకు ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మను సారథ్య బాధ్యతల నుంచి తప్పించి హార్దిక్ పాండ్యకు కెప్టెన్సీని అందించింది ముంబై యాజమాన్యం. ఈ విషయాన్ని పలువురు ఆటగాళ్లతో పాటు అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో మైదానంలో ప్రేక్షకుల నుంచి హార్దిక్ తీవ్ర అవమానాలు ఎదుర్కొంటుండగా జట్టు సభ్యుల నుంచి అతడికి సరైన మద్దతు లేదని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీటి అన్నింటిని అధిగమించి జట్టును గెలుపు బాట పట్టించాలని ప్రయత్నిస్తున్న పాండ్యకు నిరాశే మిగులుతోంది.
రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో ఓటమి అనంతరం మిగిలిన ఆటగాళ్లు అందరూ డ్రెస్సింగ్ రూమ్‌కు వెళ్లగా బాధతో హార్దిక్ పాండ్య మైదానంలో వద్ద గల డగౌట్‌లో ఒంటరిగా కూర్చోన్నాడు. దీన్ని గమనించిన మాజీ క్రికెటర్ అంబటి రాయుడు అతడి వద్దకు వెళ్లి ఓదార్చాడు. కాసేపు అతడితో ముచ్చటించాడు. అతడికి ధైర్యాన్ని చెప్పాడు. ఇందుకు సంబంధించిన వీడియోను ముంబై ఇండియన్స్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేయగా వైరల్‌గా మారింది. కాగా.. గతంలో అంబటి రాయుడు ముంబై తరుపున కొన్ని సీజన్ల పాటు ఆడిన సంగతి తెలిసిందే.
ఇదిలా ఉంటే.. ఐపీఎల్ 17వ సీజన్‌లో భాగంగా ముంబై తన తదుపరి మ్యాచ్‌ను ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో ఆడనుంది. ముంబైలోని వాంఖడే మైదానం ఈ మ్యాచ్‌కు వేదిక కానుంది. ఢిల్లీ పైన విజయం సాధించి వరుస ఓటములకు ముగింపు పలకాలని ముంబై జట్టు అభిమానులు ఆశిస్తున్నారు.
Virat Kohli : చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లి.. ఏకైక భారత క్రికెటర్.. అల్లంత దూరాన రోహిత్‌శర్మ
??? ?? ?? ????? ?? ???? ?? ??? ????? ?? ???? ????????? ??. ?#MumbaiMeriJaan #MumbaiIndians | @hardikpandya7 pic.twitter.com/k3YSlofEdV
— Mumbai Indians (@mipaltan) April 2, 2024
