Watch: వైరల్ వీడియో, గ్రౌండ్‌లోనే అమ్మాయికి లవ్ ప్రపోజ్ చేసిన ఫుట్‌బాల్ ప్లేయర్!

అమెరికన్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు హసాని డాట్సన్‌ స్టిఫెన్‌సన్‌ మేజర్‌ లీగ్‌ సాకర్‌ టోర్నీలో గ్రౌండ్‌లోనే తన గర్ల్ ఫ్రెండ్‌కి లవ్ ప్రపోజ్ చేసి వార్తల్లో నిలిచాడు.

American footballer proposes to girlfriend on field

American soccer player Love Propose: పాశ్చాత్య దేశాల్లో ఫుడ్‌బాల్‌కి ఉండే క్రేజ్ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ప్లేయర్లు కూడా వారి క్రేజ్‌కు తగ్గట్లుగానే అప్పుడప్పుడు కొన్ని పనులతో వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఇటీవల కోక్ బాటిల్స్ పక్కన పెట్టేసి మెయిన్ హెడ్‌లైన్స్‌లో నిలవగా.. ఇప్పుడు అమెరికన్‌ ఫుట్‌బాల్‌ ఆటగాడు హసాని డాట్సన్‌ స్టిఫెన్‌సన్‌ మేజర్‌ లీగ్‌ సాకర్‌ టోర్నీలో గ్రౌండ్‌లోనే తన గర్ల్ ఫ్రెండ్‌కి లవ్ ప్రపోజ్ చేసి వార్తల్లో నిలిచాడు.

మిన్నెసోటా ఎఫ్‌సీ, సాన్‌ జోస్‌ ఎర్త్‌క్వేక్స్‌ మధ్య మ్యాచ్ జరిగిన తర్వాత గ్రౌండ్‌లోనే వేల మంది అభిమానుల ముందు స్టీఫెన్‌సన్‌ తన గర్ల్‌ఫ్రెండ్‌ పెట్రా వుకోవిక్‌‌కు మొకాళ్లపై నిలబడి నన్ను పెళ్లి చేసుకుంటావా? అంటూ ఉంగరం ఇచ్చి ప్రపోజ్‌ చేశాడు. బాయ్‌ఫ్రెండ్‌ ఇచ్చిన స‌ర్‌ప్రైజ్‌తో ఉబ్బితబ్బిబ్బైన లవర్‌ వెంట‌నే ప్రపోజల్‌కు సరే అనేసింది.

ఈ వ్యవహారం మొత్తాన్ని అక్కడి కెమెరామెన్‌లు వారి కెమెరాల్లో బంధించగా.. గ్రౌండ్‌లో ప్రేక్షకులు గట్టిగా కేకలు వేస్తూ హోరెత్తించారు. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చెయ్యగా.. వైరల్‌ అవుతోంది. స్టీఫెన్‌సన్‌ ప్రపోజ్‌ చేసిన ఫోటోలను తన ప్రేయసి పెట్రా వుకోవిక్‌ సైతం ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టి ఆనందం వ్యక్తం చేసింది.

“నా హ్యపీనెస్‌ను వర్ణించడానికి మాటలు సరిపోవట్లేదు.. నీలాంటి వ్యక్తి ప్రేమ దొరకడం ఎంతో అదృష్టం. నా జీవితంలో ఈ అందమైన క్షణాలను మధుర జ్ఙాపకంగా ఉంచుకుంటాను..’ అంటూ రాసుకొచ్చింది.