చ‌రిత్ర సృష్టించిన జేమ్స్ అండ‌ర్స‌న్‌.. 147 ఏళ్ల టెస్టు క్రికెట్ చ‌రిత్ర‌లో ఒకే ఒక్క‌డు

ఇంగ్లాండ్ సీనియ‌ర్ ఆట‌గాడు జేమ్స్ అండ‌ర్స‌న్ అరుదైన ఘ‌న‌త సాధించాడు.

James Anderson 700 Test wickets

James Anderson 700 Test wickets : ఇంగ్లాండ్ సీనియ‌ర్ ఆట‌గాడు జేమ్స్ అండ‌ర్స‌న్ అరుదైన ఘ‌న‌త సాధించాడు. టెస్టు క్రికెట్‌లో 700 వికెట్లు తీసిన మొద‌టి పేస‌ర్‌గా చ‌రిత్ర సృష్టించాడు. ధ‌ర్మ‌శాల వేదిక‌గా భార‌త్‌తో జ‌రుగుతున్న ఐదో టెస్టు మ్యాచ్‌లో అండ‌ర్స‌న్ దీన్ని న‌మోదు చేశాడు. కుల్దీప్ యాద‌వ్‌ను ఔట్ చేసి టెస్టుల్లో 700 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. 41 ఏళ్ల వ‌య‌సులో అండ‌ర్స‌న్ ఈ అరుదైన ఘ‌న‌త సాధించ‌డం విశేషం.

ఇక సుదీర్ఘ ఫార్మాట్‌లో 700 కు పైగా వికెట్లు తీసిన వారిలో అండ‌ర్స‌న్ మూడో బౌల‌ర్‌. అత‌డి కంటే ముందు శ్రీలంక‌కు చెందిన ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్‌, ఆస్ట్రేలియాకు చెందిన‌ షేన్‌వార్న్‌లు మాత్ర‌మే ఈ మైలురాయిని చేరుకున్నారు. కాగా.. వీరిద్ద‌రు స్పిన్న‌ర్లు అన్న సంగ‌తి తెలిసిందే. ముత్త‌య్య ముర‌ళీధ‌ర‌న్ 800 వికెట్లు, షేన్‌వార్న్ 708 వికెట్ల‌తో టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన బౌల‌ర్ల జాబితాలో తొలి రెండు స్థానాల్లో నిలిచారు.

IND vs ENG : మూడోరోజు ఆటలో ఫీల్డింగ్‌కురాని రోహిత్ శర్మ.. కారణం ఏమిటంటే?

టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లు వీరే..

ముత్తయ్య మురళీధరన్ (శ్రీలంక) – 800 వికెట్లు
షేన్‌ వార్న్‌(ఆస్ట్రేలియా) – 708 వికెట్లు
జేమ్స్ అండర్సన్ (ఇంగ్లాండ్‌) – 700* వికెట్లు
అనిల్‌ కుంబ్లే(భార‌త్‌) – 619 వికెట్లు
స్టువర్ట్‌ బ్రాడ్ (ఇంగ్లాండ్ ) – 604 వికెట్లు
కాగా.. పై ఐదుగురిలో ఒక్క అండ‌ర్స‌న్ మాత్ర‌మే ప్ర‌స్తుతం క్రికెట్ ఆడుతున్నాడు.

షోయ‌బ్ బ‌షీర్ అరుదైన రికార్డు..

ఇంగ్లాండ్ స్పిన్న‌ర్ షోయ‌బ్ బ‌షీర్ సైతం అరుదైన రికార్డు నెల‌కొల్పాడు. 21 ఏళ్ల లోపు ఇంగ్లాండ్ త‌రుపున 5 వికెట్లు రెండు సార్లు తీసిన మొద‌టి బౌల‌ర్‌గా నిలిచాడు.

21 ఏళ్లలోపు టెస్టుల్లో ఓ ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన ఇంగ్లాండ్ బౌల‌ర్లు..
షోయ‌బ్ బ‌షీర్ – 2 సార్లు
బిల్ వోస్ -1
రెహాన్ అహ్మ‌ద్ -1

SunRisers Hyderabad : అక్క‌డ రెండు టైటిల్స్‌ గెలిచిన జెర్సీతో ఐపీఎల్‌లో స‌న్‌రైజ‌ర్స్‌.. నెట్టింట సెటైర్లు!

ట్రెండింగ్ వార్తలు